Foods For Lungs Health | ఆరోగ్యకరమైన ఆహారాలను తింటేనే మన శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పోషణ సరిగ్గా లభిస్తుంది. రోగాలు రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాల్లో పండ్లు మొదటి స్థానంలో నిలుస్తాయి. కూరగాయలు కూడా ఆరోగ్యకరమైన ఆహారాలే అని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను కూడా తినాలి. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన డైట్‌ను పాటించాలి. తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తున్నవారు లేదా కఫం అధికంగా ఉన్నవారు, ఊపిరితిత్తులకు చెందిన సమస్యలను ఎదుర్కొంటున్న వారు ప్రత్యేకమైన డైట్‌ను పాటిస్తే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తింటే శరీరంలో వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఆకుపచ్చని కూరగాయలు, బెర్రీలు, చేపలు, నట్స్ వంటి ఆహారాలను తినాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచూ ఈ ఆహారాలను తింటుంటే ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపులను తగ్గించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, ఇతర బెర్రీ పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. ఊపిరితిత్తుల కణజాలం రక్షించబడుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఊపిరితిత్తుల్లో ఉండే వాపు తగ్గుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. యాపిల్స్, పియర్స్ వంటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
బీట్రూట్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తాయి. రక్త సరఫరాను పెంచుతాయి. దీంతో ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీంతో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వెల్లుల్లి, పసుపు కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉండే కఫాన్ని తొలగించి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తరచూ తింటుంటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.