Fat | శరీరంలో అధికంగా కొవ్వు చేరడం అనే సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నూనె పదార్థాలు లేదా జంక్ ఫుడ్‌ను అధికంగా తినడం, మద్యం ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా తినడం లేదా ఆలస్యంగా తినడం, రాత్రి పూట సరిగ్గా నిద్రించకపోవడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి శరీరంలో కొవ్వు అధికంగా చేరుతోంది. దీని వల్ల దీర్ఘకాలంలో అధికంగా బరువు పెరగడంతోపాటు టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. అలాగే రక్త నాళాల్లో కొవ్వు అధికంగా చేరి కొలెస్ట్రాల్, గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. కనుక శరీరంలో అధికంగా చేరిన కొవ్వును తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అయితే కొవ్వును తగ్గించుకునేందుకు రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలో పలు మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
శరీరంలోని కొవ్వును కరిగించడంలో బీన్స్ ఎంతగానో సహాయం చేస్తాయి. రోజూ వీటిని ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తింటుంటే ఫలితం ఉంటుంది. బీన్స్‌ను తినడం వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది కొవ్వును కరిగించేందుకు సహాయం చేస్తుంది. బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల కూడా కొవ్వును కరిగించుకోవచ్చు. ఫైబర్ వల్ల కేవలం శరీరంలో ఉన్న కొవ్వు మాత్రమే కాకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సైతం కరిగిపోతుంది. దీంతో సన్నగా నాజూగ్గా మారుతారు. అధిక బరువు సులభంగా తగ్గిపోతారు. రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా ఓట్స్‌ను తింటుండాలి. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కొవ్వు కరిగేలా చేస్తుంది. అలాగే షుగర్ ఉన్నవారికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. రోజూ వీటిని తింటుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
శరీరంలోని కొవ్వును కరిగించడంలో బ్రోకలీ కూడా సహాయం చేస్తుంది. ఇందులో విటమిన్లు సి, కె, ఎ, బి6లతోపాటు ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ బ్రోకలీని ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తింటున్నా ఫలితం ఉంటుంది. శరీరంలోని కొవ్వు త్వరగా కరిగిపోతుంది. అలాగే కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్ రైస్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. ఆహారం తక్కువ తినేలా చేస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. రోజూ బ్రౌన్ రైస్‌ను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
కొవ్వు కరిగేందుకు గాను పియర్స్ పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు నిల్వలపై ప్రభావం చూపిస్తాయి. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరదు. బరువు తగ్గుతారు. అలాగే ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక కొవ్వును కరిగించి అధిక బరువును తగ్గించడంలో నిమ్మకాయలు కూడా పనిచేస్తాయి. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ఉదయం పరగడుపునే తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. రోజూ బాదంపప్పును గుప్పెడు తీసుకుని నీటిలో నానబెట్టి తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. బాదంపప్పు మనకు అనేక లాభాలను అందిస్తుంది. శరీరంలోని కొవ్వు కరిగేలా చేస్తుంది. ఇక ఇందుకు గాను మనం గ్రీన్ టీని కూడా రోజూ తాగవచ్చు. ఇది శరీరంలోని కొవ్వును గణనీయంగా తగ్గిస్తుంది. అధిక బరువు తగ్గేలా చేస్తుంది. ఇలా ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటుంటే శరీరంలోని కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు.