Belly Fat | అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కొందరికి శరీరం అంతా సన్నగానే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం లావుగా ఉంటుంది. దీంతొ పొట్టను కరిగించుకునేందుకు నానా యాతన పడుతుంటారు. అందులో భాగంగానే అనేక రకాల మార్గాలను పాటిస్తుంటారు. వ్యాయామం చేయడం, డైట్‌ను పాటించడం చేస్తుంటారు. అయినప్పటికీ ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. అయితే పొట్ట దగ్గరి కొవ్వు కరిగి పొట్ట ఫ్లాట్ మారాలన్నా, నడుము నాజూగ్గా కనిపించాలన్నా అందుకు గాను పలు డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తయారు చేసేందుకు డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ డ్రింక్స్‌ను తయారు చేయవచ్చు. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుంది. ఇక ఆ డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో జీలకర్ర ఎంతగానో పనిచేస్తుంది. జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను అలాగే మరిగించాలి. తరువాత నీటిని గోరు వెచ్చగా ఉండగానే వడకట్టి తాగేయాలి. పరగడుపునే ఈ పానీయాన్ని తాగాల్సి ఉంటుంది. ఇలా రోజూ చేస్తుంటే కొద్ది రోజులకు కచ్చితంగా మార్పు వస్తుంది. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. జీలకర్ర జీర్ణక్రియను పెంచుతుంది. మెటబాలిజం పెరిగేందుకు సహాయ పడుతుంది. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. కనుక పొట్ట ఫ్లాట్‌గా మారాలని కోరుకునే వారు జీలకర్ర నీళ్లను తాగుతుంటే ఫలితం ఉంటుంది. అలాగే వాము నీళ్లను కూడా ఇదే విధంగా తీసుకోవచ్చు. వాము నీళ్లను తాగడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరగడంతోపాటు కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.
గ్రీన్ టీలో తులసి ఆకులను వేసి మరిగించి తాగడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా వేగంగా కరిగించుకోవచ్చు. ఈ డ్రింక్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో ఈ పానీయం ఎంతగానో పనిచేస్తుంది. కనుక దీన్ని కూడా రోజూ ఉదయం తాగవచ్చు. అదేవిధంగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపునే తాగుతున్నా కూడా పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ మిశ్రమం జీర్ణశక్తిని పెంచుతుంది. మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. అయితే గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు మాత్రం ఈ మిశ్రమాన్ని డాక్టర్ సూచన మేరకు తాగాల్సి ఉంటుంది.
రాత్రి పూట నిద్రకు ముందు కొవ్వు తీసిన పాలను గోరు వెచ్చగా చేసి ఒక గ్లాస్ తీసుకుని అందులో పాలను పోసి దాంట్లో పసుపు కలిపి తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. మెటబాలిజంను పెంచుతాయి. దీంతో మనం రాత్రి నిద్రించి ఉన్నప్పటికీ కొవ్వు కరిగిపోతుంది. ఈ మిశ్రమం కూడా అధిక బరువును తగ్గించేందుకు, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను పరగడుపునే తాగుతుండాలి. ఈ నీళ్లను తాగితే కొవ్వు మెటబాలిజం పెరుగుతుంది. అలాగే ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుంది. ఇలా ఈ పానీయాలను తీసుకోవడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.