Seeds | తినేందుకు మనకు అనేక ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం వాటిని అసలు తినడం లేదు. జంక్ ఫుడ్ యుగంలో రోజూ ఉదయం నిద్ర లేచించి మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు జంక్ ఫుడ్‌నే ఎక్కువగా తింటున్నాం. రోగాల బారిన పడుతున్నాం. మన ఆరోగ్యం విషయంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు గాను వ్యాయామం చేయడం, వేళకు నిద్రించడం ఎంత ముఖ్యమో, ఆహారం కూడా అంతే ముఖ్యం. సరైన ఆహారాన్ని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ క్రమంలోనే మనకు తినేందుకు అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే గింజలు కూడా ప్రధానమైనవి. ఇవి మనకు ఎన్నో లాభాలను అందిస్తాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
మనకు మార్కెట్లో అమరాంత్ గింజలు అని లభిస్తాయి. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారంగా ఇవి పేరుగాంచాయి. వీటిని వేయించి తినవచ్చు. లేదా పిండి, రైస్, ఓట్మీల్ వంటి వాటిలో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అవిసె గింజలను కూడా రోజూ గుప్పెడు మోతాదులో తినవచ్చు. వీటిల్లో ఫైబర్‌తోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఈ గింజలను స్మూతీలు, మిల్క్ షేక్‌లలో కలిపి తీసుకోవచ్చు. అవిసె గింజల పొడిని పెరుగు వంటి వాటిపై చల్లి కూడా తినవచ్చు. అవిసె గింజలు మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
బొప్పాయి గింజలను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిల్లోనూ ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు బరువును తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. దానిమ్మ గింజలను కూడా తరచూ తింటుండాలి. ఈ గింజలను తింటే రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. రోజూ ఒక కప్పు దానిమ్మ గింజలను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే గుమ్మడికాయ విత్తనాలు కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ విత్తనాలను తింటే విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి.
ఆరోగ్యంగా ఉండేందుకు జొన్నలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. మనం ఇప్పుడు వీటిని తినడం లేదు. కానీ పెద్దలు, పూర్వీకులు ఈ గింజలనే అధికంగా తినేవారు. అందుకనే వారు వృద్ధాప్యం వచ్చినప్పటికీ ఆరోగ్యంగా ఉండేవారు. జొన్నలను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. జొన్నలతో రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. ఉడకబెట్టి ఉప్మాలాగా చేసి తినవచ్చు. లేదా కూరగాయలతోపాటు ఉడికించి తినవచ్చు. జొన్నలతో ఇడ్లీ, దోశ వంటివి కూడా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే పుచ్చకాయ విత్తనాలను తింటున్నా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. రోగాల నుంచి రక్షిస్తాయి. ఈ గింజల్లోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది. ఇలా పలు రకాల గింజలను తింటుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.