Seeds | మనకు తినేందుకు అనేక ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సీడ్స్ కూడా ఒకటి. సీడ్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఇవి మనకు పోషణను అందిస్తాయి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ క్రమంలోనే మనకు 8 రకాల సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాపులు రాకుండా చూస్తాయి. ఈ గింజల్లో లిగ్నన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. దీని వల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. మీరు తినే ఆహారంపై కాసిన్ని అవిసె గింజలను రోజూ చల్లుకుని తినడం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది. లేదంటే మీరు తాగే పానీయాల్లోనూ ఈ గింజలు లేదా వీటి పొడిని కలిపి తీసుకోవచ్చు. ఇక చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది నీటిని శోషించుకుంటుంది. దీంతో ఈ విత్తనాలు జెల్ లాగా మారుతాయి. ఇవి జీర్ణక్రియను పెంపొందిస్తాయి. చియా విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా మీరు స్మూతీలు, ఓట్ మీల్ వంటి వాటిల్లో కలిపి తీసుకోవచ్చు.
గుమ్మడికాయ విత్తనాల గురించి అందరికీ తెలిసిందే. వీటిల్లో మెగ్నిషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల పనితీరుకు ఎంతగానో సహాయం చేస్తుంది. వీటి వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాపులను తగ్గిస్తాయి. గుమ్మడికాయ విత్తనాలను రోస్ట్ చేసి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని మీరు సలాడ్స్, సూప్స్‌లో కలిపి తీసుకోవచ్చు. లేదంటే స్నాక్స్‌లా కూడా నేరుగా తినవచ్చు.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. ఈ విత్తనాల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తుంది. ఈ విత్తనాలను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక నువ్వుల్లో సెసమిన్, సెసమోల్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వాపుల నుంచి రక్షణ లభిస్తుంది. నువ్వుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల నువ్వులను కూడా రోజూ తింటుండాలి.
మెంతులను మనం తరచూ వాడుతుంటాం. మెంతులు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. మెంతులను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. మెంతులను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని రాత్రిపూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఇలా పలు రకాల గింజలను తినడం వల్ల ఎన్నో పోషకాలను పొందవచ్చు. అలాగే అనేక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.