Dates | ఖర్జూరాలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఇవి ఎడారుల్లో పెరిగే మొక్కలు కనుక ఇతర దేశాల్లో పండించిన ఖర్జూరాలను మనం దిగుమతి చేసుకుని తింటుంటాం. ఖర్జూరాలలోనూ ఈత చెట్టు కాయల మాదిరిగా విత్తనాలు ఉంటాయి. టేస్ట్ కూడా ఈత కాయలను తిన్నట్లుగానే ఉంటుంది. ఖర్జూరాల్లో అనేక గ్రేడ్లు ఉన్న ఖర్జూరాలు కూడా ఉంటాయి. వాటి గ్రేడ్‌ను బట్టి ధర మారుతుంది. అయితే ఖర్జూరాలను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. వీటిల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకుంటే శక్తి లభిస్తుంది. ఉదయం పూట వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది.
రాత్రంతా నీటిలో నానబెట్టిన ఖర్జూరాలు నాలుగింటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తినాలి. ఖర్జూరాలను ఉదయం తింటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా నీరసం, అలసట అనేవి ఉండవు. ఖర్జూరాల్లో అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల ఖర్జూరాలను తింటే సుమారుగా 1180 క్యాలరీల శక్తి లభిస్తుంది. కనుక రోజంతా చురుగ్గా పనిచేస్తారు. శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల ఖర్జూరాలను తింటే 75 గ్రాముల పిండి పదార్థాలు, 63 గ్రాముల సహజసిద్ధమైన చక్కెరలు, ఫైబర్ 8 గ్రాములు, కొవ్వులు 0.4 గ్రాములు, ప్రోటీన్లు 2.5 గ్రాములు, నీరు 21 గ్రాములు, విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములు లభిస్తాయి.
ఖర్జూరా చెట్లకు చెందిన లేత ఆకులను కొందరు కూరగా కూడా వండుకుని తింటారు. ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వీటిని తింటే జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం ఉన్నవారికి ఖర్జూరాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఖర్జూరాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్తి ఉండదు. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరాలను తరచూ తింటుంటే పెద్ద పేగుల్లో ఉండే అల్సర్లు నయమవుతాయి. మలం కదలిక సరిగ్గా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా రక్షిస్తాయి. గొంతు నొప్పి, గొంతులో మంట, గొంతులో గరగరగా ఉండడం వంటి సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలను తింటుంటే ఫలితం ఉంటుంది.
ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకుంటే జలుబు, దగ్గు, అధిక కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనాలు అయిన వారు ఖర్జూరాలను తింటుంటే ఫలితం ఉంటుంది. మూత్రాశయ సమస్యలను తగ్గించేందుకు కూడా ఖర్జూరాలను తినవచ్చు. వీటిని తింటే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. కనుక వీటిని రోజూ తింటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇలా ఖర్జూరాలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు షుగర్ కంట్రోల్లో ఉంటే డాక్టర్ సూచన మేరకు వీటిని తినవచ్చు.