Muskmelon | వేసవి కాలంలో ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు అందరూ చల్లని మార్గాల వైపు చూస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు చల్లని నీళ్లను తాగడం, కొబ్బరి నీళ్లను తీసుకోవడం లేదా పలు రకాల పండ్లను తినడం చేస్తుంటారు. అయితే ఈ సీజన్లో మనకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో ఖర్బూజా పండ్లు కూడా ఒకటి. ఇవి రుచికి చప్పగా ఉంటాయి. కనుక చాలా మంది వీటితో జ్యూస్ తయారు చేసి అందులో కాస్త చక్కెర లేదా తేనె కలిపి తాగుతుంటారు. ఖర్బూజాలను షుగర్ ఉన్నవారు కూడా తినవచ్చు. కాకపోతే చక్కెర, తేనె ఉపయోగించకూడదు. వీటిల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఖర్బూజాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, కనుక వేసవి సీజన్లో ఈ పండ్లను అసలు మిస్ చేయకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఖర్బూజాల్లో 90 శాతం నీరే ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వేసవిలో ఈ పండ్లను తింటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరం చల్లగా ఉంటుంది. వేడి మొత్తం పోతుంది. ఖర్బూజాల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్లు ఎ, సి, బి6 అధికంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటాయి. ఖర్బూజాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు అన్నీ అనేక జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. దీంతో మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం.
ఖర్బూజాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీని వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఖర్బూజాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్న నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఖర్బూజాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. మలం పేగుల్లో సులభంగా కదిలేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో క్యాలరీలు తక్కువగా, నీటి శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్లో ఈ పండ్లను చేర్చుకోవాఇ. ఇవి ఆహారం అధికంగా తీసుకోకుండా చేస్తాయి. ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.
ఖర్బూజాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఖర్బూజాల్లో విటమిన్ ఎ, బీటా కెరోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకుంటాయి. ఇలా ఖర్బూజాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి వేసవి సీజన్లో ఈ పండ్లను తినడం మరిచిపోకండి.