Guava Leaves | జామ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. జామకాయలను కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇవి మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. జామ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జామ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగాలు రాకుండా చూస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. ఇలా జామ పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే కేవలం పండ్లే కాదు.. ఆకులు కూడా మనకు కలిగే అనేక వ్యాధులను తగ్గించడంలో ఎంతగానో పనిచేస్తాయి.
జామ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి మనకు కలిగే వ్యాధులను నయం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిన్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకులను నమిలితే ప్రయోజనం ఉంటుంది. లేదా జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీంతో సమస్యలు తగ్గుతాయి. అలాగే జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రస్తుత తరుణంలో చాలా మంది వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. నిత్యం కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో వెన్ను నొప్పి వస్తోంది. అయితే ఈ సమస్య ఉన్నవారు జామ ఆకుల నీళ్లను రోజూ తాగుతుండాలి. ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జామ ఆకుల నీళ్లను రోజూ సేవిస్తుంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. జామ ఆకుల్లో క్యాన్సర్ కణాలను నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలు రక్షించబడతాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
రాత్రి పూట జామ ఆకులతో తయారు చేసిన నీళ్లను భోజనం చేసిన అనంతరం తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. దీంతో మనస్సు ప్రశాంతంగా మారి చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. జామ ఆకుల నీళ్లను రోజూ తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పొట్టలో గ్యాస్ ఉత్పత్తి కాదు. మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు. జామ ఆకుల నీళ్లను తాగితే శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ఇలా జామ ఆకులతో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.