Garlic And Ghee | భారతీయ వంటకాల్లో వెల్లుల్లిని, నెయ్యిని ఎంతో కాలంగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి రెండు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే వీటిని వంటల్లో వాడడానికి బదులుగా ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లిని, నెయ్యిని ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గడంతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. లైంగిక శక్తి పెరుగుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇవి రెండు కూడా మన మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో వీటిని ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఔషధాలుగా వాడుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా వెల్లుల్లిని, నెయ్యిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. నెయ్యి దాని బయోయాక్టివ్ సమ్మేళనాలకు చాలా ప్రసిద్ది చెందింది. క్యాన్సర్ కారకాల నిర్మాణంలో పాల్గొనే కొన్ని ఎంజైమ్ ల కార్యకలాపాలను తగ్గించడంలో నెయ్యి మనకు దోహదపడుతుంది. అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తాయని ప్రయోగాల ద్వారా వెల్లడించారు. ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణాశయం, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వెల్లుల్లిని, నెయ్యిని తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
వెల్లుల్లిని సహజ కామోద్దీపనకారిగా వర్ణిస్తారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల లైంగిక అవయవాలకు రక్తప్రవాహం పెరుగుతుంది. లైంగిక పనితీరుపై పరోక్ష ప్రభావాలను చూపుతుంది. నెయ్యిని తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. లైంగిక పనితీరు మెరుగుపడడానికి ఇది దోహదపడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా వెల్లుల్లి, నెయ్యి మనకు సహాయపడతాయి. వెల్లుల్లిలో ఆక్సీకరణ ఒత్తిడిని తట్టుకునే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లిని , నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలు లభిస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. అదే విధంగా రక్తపోటు ఉన్న వారు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తపోటు స్వల్పంగా తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలను పెంచి కొలెస్ట్రాల్ కరిగేలా చేయడంలో కూడా వెల్లుల్లి మనకు దోహదపడుతుంది. ఈ విధంగా వెల్లుల్లి, నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నెయ్యిని మితంగా తీసుకోవడం కూడా చాలా అవసరమని వారు సూచిస్తున్నారు.