Pine Nuts | పైన్ నట్స్.. ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదు. కానీ చిల్గోజా అంటే చాలా మంది అర్థం అవుతుంది. అవును వీటినే పైన్ నట్స్ అని కూడా పిలుస్తారు. పైన్ చెట్ల నుంచి ఈ నట్స్ వస్తాయి. అందుకనే వాటికి ఆ పేరు వచ్చింది. ఈ నట్స్‌ను పోషకాలకు గనిగా చెబుతుంటారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఈ నట్స్‌లో అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ నట్స్‌ను తింటే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పైన్ నట్స్‌లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఈ నట్స్‌లో అధికంగానే ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారిస్తాయి.
పైన్ నట్స్‌లో విటమిన్ ఇ, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పైన్ నట్స్‌లో మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి. అందువల్ల హైబీపీ ఉన్నవారికి పైన్ నట్స్ ఎంతగానో మేలు చేస్తాయి. పైన్ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని, బీపీ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ఈ నట్స్‌లో ఫినోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ల జాబితాకు చెందుతుంది. ఇది ఆకలిని నియంత్రించే హార్మోన్లను శరీరం ఉత్పత్తి చేసేలా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
పైన్ నట్స్ లో అధికంగా ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఇది కూడా బరువు తగ్గేందుకు ఎంతగానో దోహదపడుతుంది. మెదడు యాక్టివ్‌గా ఉండేందుకు గాను పైన్ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను పునర్నిర్మిస్తాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా మెరుగుపడి మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్తేజంగా పనిచేస్తారు. చురుగ్గా, యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం పోతుంది. పైన్ నట్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తినాలి. దీంతో రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఏ పనినైనా సరే ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నీరసం, అలసట అనేవి ఉండవు.
షుగర్ ఉన్నవారికి పైన్ నట్స్ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. ఈ నట్స్‌లో ఉండే మెగ్నిషియం ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రోజూ గుప్పెడు పైన్ నట్స్‌ను తింటుంటే షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చు. పైన్ నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రోజూ ఈ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే కంటి చూపు మెరుగు పడుతుంది. కొద్ది రోజులకు కళ్లద్దాలను తీసి పడేస్తారు. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా పైన్ నట్స్‌ను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.