Health Tips | వాల్‌నట్స్‌తో వ్యాధులు దూరం!
వాల్‌నట్స్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. వాల్‌నట్స్‌లో పుష్కలంగా లభించే ప్రొటీన్, ఒమెగా 3, ఫైబర్‌తో పాటు ఇతర కీలక పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
న్యూఢిల్లీ : వాల్‌నట్స్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. వాల్‌నట్స్‌లో పుష్కలంగా లభించే ప్రొటీన్, ఒమెగా 3, ఫైబర్‌తో పాటు ఇతర కీలక పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాల్‌నట్స్‌తో మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుందన్నది నిపుణుల మాట. ఆకలిని తీర్చుతూ అదే సమయంలో బరువు పెరగకుండా ఉండటంలో వాల్‌నట్స్‌ను మించింది లేదు.
ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటంతో వాల్నట్స్ గుండెకు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించడంతో పాటు రక్తపోటు పెరగకుండా చూస్తాయి. ఇవన్నీ హృద్రోగ ముప్పును తగ్గిస్తాయని నిపుణుల చెబుతున్నారు. వాల్నట్స్ సులభంగా జీర్ణమవడంతో పాటు జీర్ణవ్యవస్ధ సాఫీగా సాగేందుకు సహకరిస్తాయి. వాల్‌నట్స్‌ను తరచూ తీసుకుంటే ప్రేవుల ఆరోగ్యం మెరుగై జీర్ణవ్యవస్ధ ఆరోగ్యంగా ఉంంటుంది.
ఇక వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సెంట్రల్ నర్వస్ సిస్టంను నియంత్రించి భావోద్వేగాలు అదుపులో ఉండేలా చూస్తాయి. వాల్‌నట్స్‌ను స్నాక్స్‌లో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వాల్‌నట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కారణంగా వ్యాధులు దరిచేరవని పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

