Raw Garlic | మారుతున్న కాలానుగుణంగా ఆరోగ్య (health) సమస్యలూ చుట్టుముడుతున్నాయి. చిన్న వయసులోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇందుకు కారణంగా జీవనశైలిలో మార్పులే కారణం. అయితే, కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు. అందులో వెల్లుల్లి (Raw Garlic) ఒకటి.
మనం ఎక్కువగా వెల్లుల్లిని వంటల్లో వాడుతుంటాం. అయితే, పచ్చి గార్లిక్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ఇదే విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ (Soha Ali Khan) కూడా చెబుతున్నారు. తాను గత నాలుగు వారాలుగా ఉదయం ఖాళీ కడుపుతో ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బతో రోజును ప్రారంభిస్తున్నానని, దాని వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందానని వెల్లడించారు.
సోహా అలీఖాన్ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన డైట్, జిమ్ వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నెటిజన్లు, అభిమానులకు స్ఫూర్తి నిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను సోఫా వివరించారు. తాను గత నాలుగు వారాలుగా రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ చిన్న వెల్లుల్లి రెబ్బ రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటూ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని తెలిపారు. శరీరంలో వాపులను తగ్గిస్తుందని, సంపూర్ణ ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుందన్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు.
దాన్ని వీలైనంత ఎక్కువసేపు నమిలి నీటితో కలిపి మింగేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. వెల్లుల్లి తిన్న తర్వాత కాస్త నోరు దుర్వాసన వస్తుందని.. మౌత్ వాష్ చేసుకుంటే సరిపోతుందని సూచించారు. అయితే, ఈ వెల్లుల్లి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో దీన్ని తీసుకోకూడదని హెచ్చరించారు. రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకునేవారికి ఇది చేటు చేస్తుందని చెప్పారు. అలానే ఏదైనా సర్జరీకి సిద్ధమవుతున్న వారికి కూడా మంచిది కాదన్నారు. అలాంటి వారు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు.
Also Read..
Infosys | ఇన్ఫోసిస్లో 20 వేల ఉద్యోగాలు.. టీసీఎస్ లేఆఫ్స్ వేళ ఇన్ఫీ కీలక ప్రకటన
Actress Arrested | హిట్ అండ్ రన్ కేసులో నటి నందిని అరెస్ట్
Powerful Earthquakes | ప్రపంచాన్ని వణికించిన అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఇవే..