Actress Arrested | హిట్ అండ్ రన్ కేసు (Hit And Run Case) లో ప్రముఖ నటి అరెస్టయ్యారు (Actress Arrested). ఈ ఘటన అస్సాం రాష్ట్రం గువాహటి (Guhawati)లో చోటు చేసుకుంది. అస్సామీ నటి నందిని కష్యప్ (Nandini Kashyap).. 120 కిలోమీటర్ల కంటే వేగంతో కారు నడుపుతూ ఓ విద్యార్థిని ఢీ కొట్టింది. సదరు విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గువాహటి పోలీసులు నటిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 25న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నందిని కష్యప్ కారు నడుపుకుంటూ వెళ్తోంది. షూటింగ్‌ను ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. గువాహటిలోని దఖింగావ్ ప్రాంతంలో ఆమె కారు 21 ఏళ్ల విద్యార్థిని ఢీ కొట్టింది. బాధితుడు గువాహటి మున్సిపల్ కార్పొరేషన్లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న నల్బరి పాలిటెక్నిక్ విద్యార్థి సమియుల్ హక్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, గాయపడిన విద్యార్థికి సాయం చేసేందుకు కూడా నటి ముందుకు రాలేదు. ప్రమాదం అనంతరం కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దీంతో కొందరు పారిశుద్ధ్య కార్మికులు నటి కారును వెంబడించగా.. కహిలిపారాలోని ఓ అపార్ట్మెంట్ వద్ద గుర్తించారు. అక్కడ ఆమె తన ఎస్యూవీ కారును దాచేందుకు ప్రయత్నించినట్లు వారు ఆరోపించారు. ఈ క్రమంలో నటికి, కార్మికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన బాధిత విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నటి కారును సీజ్ చేశారు. నటిని విచారించగా.. ఈ కేసులో తన ప్రమేయాన్ని తోసిపుచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఆమెను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు గువాహటి పోలీస్ డీసీపీ (ట్రాఫిక్) జయంత సారథి బోరా తెలిపారు. నటిని స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.
Also Read..
Powerful Earthquakes | ప్రపంచాన్ని వణికించిన అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఇవే..
Donald Trump | 25 శాతం వరకూ సుంకాలు.. డెడ్‌లైన్‌కు ముందు భారత్‌కు ట్రంప్ వార్నింగ్
Amarnath Yatra | జమ్ము కశ్మీర్లో భారీ వర్షాలు.. అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్