Sleeping Disorder | నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు. శరీరానికి, మనసుకు రీచార్జ్ టైమ్. తగినంత నిద్ర లేకపోయినా, ఆ నిద్రలో తగినంత గాఢత లేకపోయినా.. మానసిక, శారీరక సమస్యలు తప్పవు. అందుకే బాగా నిద్ర పట్టేందుకు రాత్రి పడుకునేముందు కొన్నిరకాల పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
అనాదిగా పెద్దలు చేస్తున్న సూచనే ఇది. ఇందుకు శాస్త్రీయమైన కారణాలు లేకపోలేదు. పాలలోని ట్రిప్టోఫాన్ అనే రసాయనం నిద్రను, మానసిక ప్రశాంతతను నియంత్రించే సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. నిద్రను ఆహ్వానిస్తుంది.
ఈమధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న పానీయమిది. ఇందులోని ఎపిజెనిన్ అనే రసాయనం మెదడు సేదతీరేలా చేస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గి, నిద్ర పట్టేస్తుంది.
ఆయుర్వేదంలో జటామాంసిగా పిలిచే వలేరియన్కు మత్తెక్కించే లక్షణం ఉంది. నిద్రలేమిని, ఒత్తిడిని తగ్గించి శరీరం విశ్రాంత స్థితికి చేరుకునేలా చేస్తుంది.
లావెండర్, నిమ్మ, కృష్ణ కమలం లాంటి ఔషధ మొక్కలతో రూపొందించిన కషాయాలు కూడా నిద్రకు మేలుచేస్తాయి.