శనగలు: కప్పు, గోధుమ పిండి: కప్పు నెయ్యి లేదా నూనె: రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర: అరకట్ట, ఉల్లి గడ్డ: ఒకటి అల్లం: చిన్న ముక్క, పచ్చి మిరపకాయలు: రెండు ఆవనూనె: రెండు టేబుల్ స్పూన్లు సోంపు, ధనియాలు: స్పూను చొప్పున జీలకర్ర: అర స్పూను, పసుపు: పావు చెంచా వెల్లుల్లిపాయలు: నాలుగు రెబ్బలు ఉప్పు: తగినంత
గోధుమ పిండిలో టీ స్పూను నెయ్యి లేదా నూనె వేసి చపాతీ పిండిలా కలిపి పక్కకు పెట్టాలి. శనగలను ముందు రోజు నానబెట్టుకోవాలి. తెల్లవారి వాటిని ఒక గిన్నెలో వేసి ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చి మిరపకాయలను సన్నటి ముక్కలుగా తరుక్కోవాలి. అల్లం తురిమి పెట్టుకోవాలి. వెల్లుల్లి పాయల్ని కూడా సన్నగా తరగాలి.
ఇప్పుడు సోంపు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, పసుపులను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇందాక మిక్సీ పట్టిన శనగల్లోకి ఈ పొడితో పాటు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కొత్తిమీరలను వేసి, ఆవనూనె కూడా జోడించి బాగా కలపాలి. ఇది పరాఠాల్లోకి కూరడానికి పనికొస్తుందన్న మాట. ఇప్పుడు చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని అందులో ఈ మిశ్రమాన్ని ఉంచి పరాఠాల్లా ఒత్తుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా నెయ్యిగానీ నూనెగానీ వేసి కాల్చుకుంటే, శనగల పరాఠా సిద్ధమైపోతుంది.