– కె. వినోద్, వివేకానంద నగర్.
అనేక పట్టణాలలో ఇలాంటి ఇబ్బందులున్న లే-అవుట్లు ఉన్నాయి. అన్నిరకాలుగా చూసుకొని.. చెరువుల వద్ద నిర్మాణం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈరోజుల్లో ‘వ్యూ’ కోసం చెరువుల వద్దనే ఎక్కువ నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ, దక్షిణం-పశ్చిమం చెరువులు ఉన్నప్పుడు అలాంటి లే-అవుట్లలో గృహాలు యోగించవు. నగరాలలో, పల్లెల్లో అలా చేసిన ఇండ్లల్లో అనేక ఆర్థిక, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మన నగరాల్లో అలా నిర్మించిన గృహ సముదాయాలను పరిశీలిస్తే మనకే అర్థం అవుతుంది. అలాగని తూర్పున, ఉత్తరాన ఉండొచ్చు అనుకోవద్దు. సరైన దూరంలో, సరైన విధానంలో అవి ఉన్నప్పుడు వాటి ఫలితాలు బాగుంటాయి. ఆగ్నేయంలో నిప్పు ఉండొచ్చు అని అంటుంది శాస్త్రం. అలాగని ఇంటి వంటగదిలో బండెడు కట్టెలు కాల్చగలమా? తగు మోతాదు.. వంటకే కాదు, ఇంటికీ వర్తిస్తుంది. పంచభూతాలు సమపాళ్లుగా ఉంటేనే ఆనందం. అతి ఏదీ మంచిదికాదు.
– వి. రాధిక, కోఠి.
కిటికీ వెడల్పు-ఎత్తులు మనం నిర్ణయించుకున్నంత ఉంటాయి. అయితే, ఆయా గదులకు వచ్చే కొలతను బట్టి, ఆ గోడ వెడల్పును బట్టి.. కిటికీ నాలుగు-ఆరు అడుగుల వెడల్పు ఉంటుంది. కిటికీ ఎత్తుకూడా ఫ్లోరింగ్ నుంచి కాకుండా.. రెండున్నర అడుగుల ఎత్తు తర్వాతనే పెట్టాలి. అంటే.. నాలుగున్నర అడుగులు కిటికీ ఎత్తు స్థిరం చేసుకోవాలి. స్థలాన్ని బట్టి వెడల్పును అడ్జస్టు చేసుకోవాలి. ఇంటిలోని వాతావరణాన్ని, గాలి-వెలుతురును ద్వారాలు, కిటికీలే నిర్ణయిస్తాయి. ఇక కిటికీల మీద సన్షేడ్ (సజ్జ) తప్పనిసరిగా ఉండాలి. అది వర్షం, ఎండలను క్రమబద్ధం చేస్తుంది. మనది ఊష్ణమండలం. తప్పక దక్షిణం, పడమర నుంచి వచ్చే ఊష్ణశక్తిని తట్టుకోవడానికి అది దోహదపడతాయి.
– వి. చంద్రకళ, బోడుప్పల్.
నాడు మట్టి వాసనలను బట్టి.. భూమి రుచులను, గుణాలను తెలుసుకునేవారు. దానిని ‘గంధ పరీక్ష’గా పిలిచేవారు. అనేక వ్యర్థ పదార్థాలు నిండిన నేల.. వర్షం పడినప్పుడు ‘కుళ్లిన’ వాసనతో ఉంటుంది. అలాంటి భూమిలో నిర్మాణం అంత భద్రతగా ఉండదని నిర్ధారించేవారు. మట్టిలో కొన్ని రసాయనిక లవణాలతో రుచి కూడా ఏర్పడుతుంది. సల్ఫేట్, క్లోరైడ్ మొదలైన రసాయన పదార్థాల వల్ల భూమిలో మార్పులు వస్తాయి. అవి అధిక మొత్తంలో ఉన్నప్పుడు ఆయా భూముల్లో చేసిన నిర్మాణాల పునాదులు దెబ్బతింటాయి.

అంతేకాకుండా, ఆ భూముల్లోని నీరు కూడా కలుషితమై ఉంటుందనే దృష్టితో భూములను పరీక్షించడం నాటి పద్ధతిగా ఉండేది. భూముల తీరు, వాటి నాణ్యతలను, ఆమ్లం-పులుపు, చేదు లాంటి రుచులను బట్టి నిర్ణయించేవారు. ఈనాడున్న విజ్ఞాన శాస్త్రంతో మనం అన్నిచోట్ల ‘సాయిల్ టెస్ట్’ చేసి, పునాది ఎంత లోతు వెళ్లాలి? ఏ విధమైన నిర్మాణ పద్ధతి అనుసరించాలి? అనేవి తెలుసుకుంటున్నాం. ఏదేమైనా నిర్మాణ భద్రతే.. భూమి పరీక్షల ఆంతర్యం.
– కె.వి. చైతన్య, కొంపెల్లి.
వీధిపోట్లు ఉన్న స్థలాలు కావడం మంచిదికాదు. కొన్ని తెలియక కొన్నా.. పూర్తిగా ఆ వీధి ఎంతవరకూ పడుతుందో అంతమేరకు స్థలం వదలడం మంచి విధానం. పెద్ద స్థలం అయితే.. ఆ వీధిని అలాగే లోపలికి తీసుకోవాలి. తద్వారా ఆ స్థలం రెండు భాగాలుగా మారుతుంది.

దక్షిణంలో వీధిపోటు పడుతున్నప్పుడు ఆ రోడ్డును లోపలికి తీసుకుంటే.. ఒక భాగం తూర్పు రోడ్డుగా, మరొకటి పడమర స్థలంగా మారుతుంది. అలా ఆ స్థలాన్ని వినియోగించుకోవచ్చు. దక్షిణం రోడ్డు ఉండి, దక్షిణ-నైరుతిలో వీధిశూల ఉంటే.. ఆ పడుతున్న మేరకు స్థలాన్ని వదిలి, పడమర వీధిగా మార్చాలి. ఇలా స్థలాన్ని విడగొట్టినప్పుడే ఆ దోషం సమూలంగా పోతుంది. గోడలు కట్టి, దేవుని బొమ్మలు పెట్టి.. వాటి దోషాలను నివారించలేం.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143