Back pain | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Back pain | సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, కాల్‌సెంటర్ తదితర విభాగాల్లో పనిచేసేవారు నడుము, మెడ నొప్పితో ఇబ్బందిపడుతున్నారు.
Back pain | మారుతున్న కాలానికి అనుగుణంగా, మనిషి జీవన శైలిలో పెనుమార్పులు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల కార్యాలయాల్లో భౌతిక శ్రమ తగ్గిపోయింది. సుఖవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. కొత్త వ్యసనాలు వచ్చి చేరాయి. ముఖ్యంగా ‘డిజిటల్ జీవితం’ మెడ, నడుము తదితర కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. చాలామందిలో కనిపించే మెడ, నడుము నొప్పులు వైద్యపరమైన రుగ్మతలు కావు, నూటికి నూరుశాతం ‘యాంత్రిక’ సమస్యలే. ప్రతి పదిమందిలో ఏడుగురిని ‘స్పాండిలైటిస్’ వెంటాడుతున్నది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మస్తాన్ యాదవ్ సూచనలు..

మనిషి కండరాలు యంత్రాలతో సమానం. నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. అప్పుడే, శరీర వ్యవస్థ బలంగా ఉంటుంది. కానీ, టెక్నాలజీ పెరిగిపోయాక భౌతిక శ్రమ నామమాత్రమైంది. ఉద్యోగులు, వృత్తి నిపుణులు కుర్చీలకే పరిమితం అవుతున్నారు. ఇలా ఒకేచోట కూర్చోవడం వల్ల కండరాలకు తగినంత వ్యాయామం ఉండటం లేదు. ప్రధాన భాగాలు బలహీనపడిపోయి సున్నితంగా మారుతున్నాయి. బరువైన పనిచేయాల్సి వచ్చినప్పుడో, ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడో తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఈ క్రమంలో వెన్నుపూసలోని డిస్కులు దెబ్బతింటాయి. ఈ పరిస్థితినే ‘స్పాండిలైటిస్’ ( Back pain ) అంటారు. అపసవ్య జీవన విధానమే స్పాండిలైటిస్‌కు ప్రధాన కారణం.

అరుగుదలే అసలు సమస్య
నడుములోని వెన్నుపూస, డిస్కులు అరిగిపోవడం వల్ల నడుము నొప్పి వస్తుంది. మెడలోని డిస్కులు అరిగిపోవడం వల్ల మెడ నొప్పి వెంటాడుతుంది. మెడలోని డిస్కులు అరిగిపోతే దాన్ని ‘సర్వైకల్ స్పాండిలైటిస్’ అంటారు. నడుము వద్ద ఉన్న డిస్కులు జారిపోతే దాన్ని ‘లంబార్ స్పాండిలైటిస్’గా వ్యవహరిస్తారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం, సమస్య మరింత జటిలమై తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది.

నాడు-నేడు
రెండు దశాబ్దాల క్రితం వరకూ స్పాండిలైటిస్ అనేది 50 ఏండ్లు పైబడిన వారిలో మాత్రమే కనిపించేది. వయసు రీత్యా డిస్కుల అరుగుదలతో నొప్పులు వచ్చేవి. కానీ కాలక్రమంలో జీవనశైలి లోపాలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల యువతనూ ఈ సమస్య వెంటాడుతున్నది. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, కాల్‌సెంటర్ తదితర విభాగాల్లో పనిచేసేవారు నడుము, మెడ నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. జీవనశైలి కారణాల వల్ల భౌతిక శ్రమ తగ్గినప్పుడు, ఆ నష్టాన్ని పూరించడానికి వ్యాయామం, నడక, యోగ.. వంటివి నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. కానీ తీవ్ర పని ఒత్తిడి వల్లనో, బద్ధకం వల్లనో వాటికి కూడా సమయం కేటాయించలేక పోతున్నారు. పెరిగిన పని వేళలు, నిద్రలోనూ వెంటాడే డెడ్లైన్ల పుణ్యమా అని రోజుకు పది నుంచి పదిహేను గంటలు ఆఫీసు సీట్లకే అతుక్కుపోతున్నారు. మిగతా సమయాన్ని టీవీలు, సెల్ఫోన్లు మింగేస్తున్నాయి.

కరోనా ప్రభావం
కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర కాలం నుంచీ పిల్లలు సైతం నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారు. గంటల తరబడి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అసలే చిన్నారుల కండరాలు సున్నితంగా ఉంటాయి. ఫలితంగా చిన్న వయసులోనే నడుము, మెడ నొప్పి మొదలవుతున్నాయి. దీనివల్ల 30-40 ఏండ్లు వచ్చేసరికి డిస్క్‌లు అరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. కండరాల ఎదుగుదల కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. వైరస్ బారినపడి, కోలుకున్న వారిలోనూ కండరాల సమస్యలు, కీళ్లనొప్పులు బయటపడుతున్నాయి. దీన్నే ‘ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్’ అంటారు.. అంటే, వాతంతో కూడిన నొప్పులు. సాధారణంగా ఇన్ఫెక్షన్లు వాతాన్ని పెంచుతాయి. రోగి ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు సహజం. ఈ లక్షణం చికున్ గున్యాలో మరీ అధికం. డెంగీ, స్వైన్ ఫ్లూలలో కూడా ఈ లక్షణాలు బహిర్గతం అవుతాయి. కరోనా తర్వాత కూడా కొందరిలో ‘ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్’ లక్షణాలను గుర్తిస్తున్నారు వైద్యులు.
ఔషధాలు వాడకుండానే

నేచురోపతి ఫిజీషియన్, హీలింగ్ హస్త బ్యాక్ అండ్ నెక్ పెయిన్ క్లినిక్
బంజారాహిల్స్
ప్రకృతి వైద్య విధానంతో ఎలాంటి ఔషధాలూ లేకుండానే స్పాండిలైటిస్ వంటి సమస్యలను పూర్తిగా దూరం చేయవచ్చు. ఈ చికిత్సా పద్ధతిలో రోగి జీవన విధానంలో మార్పులు తీసుకువస్తారు. ఫిజియోథెరపీ, హైడ్రో థెరపీ, యోగా థెరపీ, ఆహార నియమాలు ఇక్కడ చాలా ముఖ్యం. జీవనశైలి మార్పుల ద్వారా జీవితాన్నే మార్చేసే అద్భుత విధానం ఇది.
నడుము, మెడ నొప్పి – ప్రధాన కారణాలు
- డిజిటల్ జీవనం.
- శారీరక శ్రమ కరువైపోవడం.
- తగినంత వ్యాయామం లేకపోవడం.
- మానసిక ఒత్తిడి.
- పోషక విలువల లోపం.
- నిలువ చేసిన ఆహారం తినడం.

ఆహార నియమాలు
- వ్యాయామం లేదా యోగా తరువాత బార్లీ నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయి.
- మొలకెత్తిన గింజలు (శెనగలు, పెసర్లు, పల్లీ), మష్రూమ్, పనీర్, సోయా తదితర ప్రొటీన్ పోషకాలు తీసుకోవాలి. వీటివల్ల కండరాలు బలంగా మారుతాయి.
- డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ మంచి చేస్తాయి. నానబెట్టిన బాదం, పిస్తా, వాల్నట్స్ తీసుకోవాలి. వీటివల్ల నరాలు
- బలపడతాయి.
- పాలు, పెరుగు, ఆకు కూరలు, అవిసె గింజలు, రాగి జావ తదితరాలను తీసుకోవాలి. ఇవి ఎముకల బలానికి తోడ్పడుతాయి.
- రోజూ 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. దీనివల్ల కండరాల బిగుసుదనం తగ్గుతుంది.

లక్షణాలు
- మెడ, నడుము నొప్పి.
- తొలిదశలో మెడ, నడుము వద్ద కండరాలు బిగుసుకుపోయినట్లు భారంగా మారిపోవడం. మెడను, నడుమును కదిలించలేని పరిస్థితి.
- రెండో దశలో కాళ్లు, చేతులు, వీపు భాగాల్లో మంట. తిమ్మిర్లు రావడం, మొద్దుబారినట్లు, బరువెక్కినట్లు అనిపించడం.
- ఉదయం లేవగానే ఒళ్లంతా భారం, భరించలేని నొప్పి.
- దగ్గినా, తుమ్మినా నొప్పే.
- చిన్నపాటి పనులు కూడా చేసుకోలేకపోవడం.
- కాళ్లు, చేతులు ఒత్తుకోవాలని అనిపించడం.

జాగ్రత్తలు
- తొలి దశలోనే వైద్యులను సంప్రదించాలి.
- పెయిన్ కిల్లర్స్ వాడకూడదు.
- లక్షణాలపై కాకుండా నొప్పుల కారణాలపై దృష్టిపెట్టాలి.
- సాధ్యమైనంతవరకూ ఔషధాల ప్రస్తావనలేని వైద్య విధానాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే స్పాండిలైటిస్ అనేది ఒత్తిడి, కండరాల బలహీనతతో వచ్చే సమస్య.
- వైద్యుల సలహా మేరకే, తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వాడాలి.

యోగ చికిత్స
మెడనొప్పి నియంత్రణ కోసం నిత్యం.. మెడను నెమ్మదిగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 10 సార్లు తిప్పాలి. తరువాత కింద నుంచి పైకి, పై నుంచి కిందికి 10 సార్లు, కుడి భుజం నుంచి ఎడమ భుజం వైపునకు, ఎడమ నుంచి కుడి భుజం వైపునకు 10 సార్లు వంచాలి. దిగువ తెలిపిన ఆసనాలను కూడా నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయాలి.
- పవనముక్తాసనం.
- సేతుబంధాసనం.
- మత్స్యేంద్రాసనం.
- శలభాసనం.
- భుజంగాసనం.
- ధనురాసనం.
- శిథిలాసనం.
… మహేశ్వర్‌రావు బండారి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు కొత్త తంటా.. పెరుగుతున్న మెల్లకన్ను సమస్యలు
తల్లిదండ్రులకు హెచ్చరిక.. డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా వాడే పిల్లల్లో ఊబకాయం ముప్పు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

