HomeHealthScreen Time For Our Eyes Screen Time Food Without Nutrients Lifestyle Without Effort
కంటికి రెప్పలా..
గంటల కొద్దీ స్క్రీన్ టైమ్, పోషకాలు లేని ఆహారం, శ్రమ లేని జీవనశైలి.. వీటివల్ల పలకరించే రకరకాల ఇబ్బందులలో ఒకటి కంటి సమస్య.
గంటల కొద్దీ స్క్రీన్ టైమ్, పోషకాలు లేని ఆహారం, శ్రమ లేని జీవనశైలి.. వీటివల్ల పలకరించే రకరకాల ఇబ్బందులలో ఒకటి కంటి సమస్య. 30 ఏండ్ల తర్వాత, చత్వారం లాంటివి తలెత్తే ప్రమాదం
ఉండి తీరుతుంది. దానినుంచి దూరంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
30 ఏళ్ల తర్వాత తరచూ నిపుణుల పర్యవేక్షణలో కంటి పరీక్షలు చేయించుకోవాలి. కాటరాక్ట్, గ్లకోమా లాంటి సమస్యలను వారు తొలి దశలోనే గుర్తించగలరు.
వంశపారంపర్యంగా కంటి సమస్యలు ఉంటే మరింత జాగ్రత్తపడి, ఆ విషయాన్ని వైద్యుడితో పంచుకోవాలి.
కంటి ఆరోగ్యం కోసం తాజా పండ్లు, కాయగూరలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
ధూమపానం వల్ల ఊపిరితిత్తులకే కాదు… కంటికి కూడా చేటన్నది పరిశోధకుల మాట. పొగ, నికోటిన్ రెండూ కూడా కంటి ఆరోగ్యానికి మంచివి కావు.