న్యూఢిల్లీ : చలికాలం వచ్చీరావడంతోనే జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్లను వెంటతీసుకువస్తుంది. అల్లం, పసుపు వంటి వంటింటి ఔషధాలతో ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యూనిటీ బలపడినా కుంకుమ పువ్వు (Saffron Benefits) కూడా సూపర్ హీరోలా వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడుతుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో పలు రుగ్మతలను కుంకుమ పువ్వు దరిచేరనీయదని నిపుణులు పేర్కొంటున్నారు.
కేసర్‌గా పేరొందిన కుంకుమపువ్వు యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా ముందుకొచ్చింది. కుంకుమపువ్వలో ఉండే క్రొసెటిన్ అనే పదార్ధం కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించి హృద్రోగ సమస్యలను నిరోధిస్తుందని డీకే పబ్లిషింగ్ హీలింగ్ ఫుడ్స్ పేర్కొంది.
కుంకుమపువ్వులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఆస్త్మా, అలర్జీ చికిత్సలో విశేషంగా పనిచేస్తాయని బెంగళూర్‌కు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజూ సూద్ చెబుతున్నారు. కుంకుమపువ్వుతో చేసిన ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్ధ మెరుగవడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు.
కుంకుమపువ్వు టీ
కేసర్ దూద్
కుంకుమపువ్వు-తేనె
కుంకుమపువ్వుతో ఆవిరి
Read More :