Pumpkin Health Benefits | ఆరోగ్యకరమైన ఆహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అనారోగ్యకరమైన ఆహారాలను తింటే రోగాల బారిన పడతాము. అందుకని మనకు అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు ఆరోగ్యకరమైనవి మనకు అందుబాటులో ఉన్నా చాలా మంది వాటి గురించి పట్టించుకోరు. ఇక కొందరు అలాంటి ఆహారాలు ఆరోగ్యకరం అని తెలిసినా కూడా వాటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. అలాంటి ఆహారాల్లో గుమ్మడికాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది అంతగా. ఇష్టపడరు. మన పెద్దలు గుమ్మడికాయలతో అనేక రకాల కూరలు లేదా స్వీట్లు చేసి తినేవారు. కానీ ఇప్పుడు గుమ్మడికాయలను తినేవారి సంఖ్య తగ్గిపోయింది. అయితే వాస్తవానికి గుమ్మడికాయలు మనకు అందించే లాబాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
గుమ్మడికాయల్లో పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. బీపీ ఉన్నవారికి గుమ్మడికాయలను వరంగా చెప్పవచ్చు. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. అందుకనే గుమ్మడికాయలు నారింజ రంగులో ఉంటాయి. ఈ క్రమంలో మనం గుమ్మడికాయలను తింటే మన శరీరంలో బీటా కెరోటిన్ విటమిన్ ఎగా మారుతుంది. ఇది ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంతోపాటు కంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి వ్యాధులు ఉన్నవారు తరచూ గుమ్మడికాయలను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఇక ఈ కాయల్లో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా చూసుకోవచ్చు.
గుమ్మడికాయల్లో పోషకాలు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పైగా ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ కాయలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. బరువు తగ్గాలని డైట్‌ను పాటిస్తున్నవారు కచ్చితంగా గుమ్మడికాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో త్వరగా బరువు తగ్గవచ్చు. అదేవిధంగా గుమ్మడికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా కణాలు డ్యామేజ్ అవకుండా రక్షించబడతాయి. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
గుమ్మడికాయల్లో ఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఈ కాయల్లో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అదేవిధంగా నీరసం, అలసట, బలహీనంగా ఉన్నవారు గుమ్మడికాయలను తింటుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అంత సులభంగా అలసిపోరు. ఈ కాయలను తినడం వల్ల వీటిలోని బీటా కెరోటిన్ శిరోజాలు, చర్మానికి సైతం ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా గుమ్మడికాయలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.