న్యూయార్క్ : ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ (Cancer Prevention) ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే మరణాల్లో రెండో అతిపెద్ద కారణంగా నిలిచింది. 2020లో క్యాన్సర్‌తో బాధపడుతూ ఏకంగా కోటి మంది మృత్యువాతన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు వెల్లడించాయి. శరీరంలోని కొన్ని కణాలు నియంత్రించలేని రీతిలో పెరగడంతో పాటు శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాప్తి చెందడాన్ని క్యాన్సర్‌గా నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నిర్వచించింది.
పలు రకాల క్యాన్సర్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యాప్తి చెందుతుండటంతో చాలా మంది క్యాన్సర్‌ను గుర్తించలేకపోతున్నారు. కొందరిలో లక్షణాలున్నా అవి సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరపడుతుండటంతో చివరిదశలో క్యాన్సర్ బయటపడుతుండటం ప్రాణాంతకంగా మారుతోంది. క్యాన్సర్ డెవలప్ కాకుండా నిర్ధిష్ట ఆహారం ఉపకరిస్తుంది. క్యాన్సర్ ముప్పును నిరోధించే ఆహార పదార్ధాలను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జర్నల్ ప్రివెంటింగ్ క్రానిక్ డిసీజ్‌లో ప్రస్తావించారు. పవర్‌హౌస్ ఫుడ్స్ క్రానిక్ డిసీజ్ రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తాయని న్యూజెర్సీకి చెందిన విలియం పీటర్సన్ వర్సిటీ పరిశోధకులు జెన్నిఫర్ డినోవా పేర్కొన్నారు.
చైనీస్ క్యాబేజ్, కొలార్డ్ గ్రీన్ వంటి తాజా కూరగాయలు, బచ్చలి కూర, పాల కూర వంటి ఆకుకూరలతో కూడిన పవర్‌హౌస్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ క్యాన్సర్ ముప్పును నిరోధిస్తాయని జెన్నిఫర్ రాసుకొచ్చారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కణాలను నాశనం చేయడంతో పాటు క్యాన్సర్ కణాల వ్యాప్తికి కారణమవుతుంది. అందుకే యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
Read More :