మొక్కజొన్న అచ్చమైన సిరిధాన్యం. ఇందులో జీర్ణకోశ వ్యవస్థకు ఉపయోగపడే అన్ని రకాల పీచులూ ఉంటాయి. ఇవి అరుగుదలకు, మలబద్ధక
నివారణకు ఉపకరిస్తాయి. శరీరంలోని చక్కెర స్థాయులనూ నియంత్రిస్తాయి.
పాప్‌కార్న్‌లో పాలీ ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ నివారణకు పనిచేస్తాయి. చర్మం మీద ముడతల్ని నివారించి యవ్వనంగా ఉంచేందుకు సహకరిస్తాయి.
పాప్‌కార్న్ మధుమేహ రోగులకు ఉత్తమ ఫలహారం. నిక్షేపంగా తినొచ్చు.
ఇందులో ఇనుము పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి, ఊబకాయాన్ని వదిలించుకోడానికి చక్కని మార్గం.