Amla | ఉసిరికాయలను తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చలి కాలంలో ఉసిరికాయలు మనకు విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఉసిరికాయ మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరికాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఉసిరికాయ వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే ఉసిరికాయ వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీన్ని ఎవరు పడితే వారు తినకూడదు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉసిరికాయలు పడవు. దీంతో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉసిరికాయను అసలు తినకూడదు. మరి ఎవరు ఉసిరికాయని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా.
కొందరికి తీవ్రమైన అసిడిటీ సమస్య ఉంటుంది. పొట్ట ఉబ్బరంగా కడుపులో మంటగా ఉంటుంది. అయితే విటమిన్ సి ఎక్కువగా ఉన్నందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయని తినకూడదు. తింటే ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య ఉన్నవారు పరగడుపున ఉసిరికాయలను అసలు తీసుకోకూడదు. అలాగే జ్యూస్ కూడా తాగకూడదు. తీసుకుంటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదైనా సర్జరీకి ముందు లేదా తరువాత కూడా ఉసిరికాయలను తినకూడదు. అంతగా తినాలనిపిస్తే డాక్టర్ సలహా మేరకు తినడం ఉత్తమం.
ఉసిరికాయలను తినడం వల్ల షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి కనుక లో షుగర్ లెవెల్స్ ఉన్నవారు వీటిని తినకూడదు. షుగర్ లెవెల్స్ పడిపోయే సమస్య ఉన్నవారు ఉసిరికాయలు తినకపోవడమే మంచిది. రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా ఉసిరికాయలను తినకూడదు. రక్తాన్ని మరింత పలుచగా చేస్తాయి. కనుక వీరు డాక్టర్ సలహా మేరకు ఉసిరికాయని తీసుకోవడం మంచిది. చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు కూడా ఉసిరికాయలను అతిగా తినకూడదు. తింటే చర్మం దురదగా మారడం, తీవ్రమైన చుండ్రు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
కనుక వీరు ఉసిరికాయలను తినరాదు. ఇలా పలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరికాయలను తినకూడదు. చలికాలంలో ఉసిరికాయలు తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి కానీ పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదు. ఇక మిగిలిన ఎవరైనా వీటిని తినవచ్చు. ఉసిరికాయల్ని తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరగడమే కాదు కూడా జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఆయుర్వేదంలో ఉసిరికాయలకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. త్రిఫలాల్లో ఉసిరికాయలు కూడా ఒకటి. వీటితో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఉసిరికాయలను తింటే లాభాలను పొందవచ్చు. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు.