వయసు పెరిగే కొద్దీ సత్తువ తగ్గిపోతుంది, రకరకాల వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే వీలైనంత విశ్రాంతి తీసుకుంటూ, వేళకు మందులు వాడుతూ ఆయువును పెంచుకునే ప్రయత్నం చేయాలి! ఇదే కదా ఇప్పటి భావన. వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని చెబుతున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వయసు పెరిగే కొద్దీ మరింత శక్తిమంతంగా ఉండేందుకు అనువుగా మన శరీరాలు రూపొందాయట. ‘నా పని అయిపోయింది’ అని ఇక కూర్చుండిపోకుండా, శారీరక శ్రమ చేయడం వల్ల ఏర్పడే అదనపు సత్తువతో శరీరం దృఢంగా మారుతుందనీ, మధుమేహం లాంటి సమస్యలు రావనీ, దెబ్బతిన్న కండరాలు బాగుపడతాయనీ, కొవ్వు పేరుకోవడం లాంటి ఇబ్బందులు బాధపెట్టవనీ చెబుతున్నారు పరిశోధకులు. ఈమధ్య కాలంలో ఆయుఃప్రమాణం చాలా పెరిగిపోయిందని సంబరపడిపోతున్నాం మనం. నిజానికి అంటువ్యాధుల్లాంటి సమస్యలు రాకపోతే, మన పూర్వీకులు మనకంటే ఎక్కువ కాలం, మరింత ఆరోగ్యంగా జీవించేవారని తేలిందట. దీనికి కారణం వారు నిరంతర చలనంతో జీవించడమే!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మెంతులు చేసే మేలు అంతింత కాదయా.. మధుమేహ రోగులకు లాభాలు మెండయా..!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
Dandruff | చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా? ఇలా చేసి చూడండి