పల్లీలు.. ‘పేదవాళ్ల బాదం’గా గుర్తింపు పొందాయి. ఖరీదైన బాదం గింజల్లో లభించే అన్ని రకాల పోషకాలు.. ఈ పేదోళ్ల పల్లీల్లోనూ దొరుకుతాయి. ఒకరకంగా చూస్తే.. తక్కువ ధరలో, ఎక్కువ లాభాలు అందించేవి.. పల్లీలే! బాదం, పల్లీలు.. రెండిటిలోనూ క్యాలరీలు అధికంగా ఉంటాయి. 100 గ్రా. బాదం గింజల్లో 579 క్యాలరీలు లభిస్తే.. అదే 100 గ్రా. పల్లీలు తింటే 587 క్యాలరీలు శరీరానికి అందుతాయి.
పల్లీల్లో 16% ప్రొటీన్లు ఉంటే.. బాదంలో 14% కనిపిస్తాయి. కొలెస్ట్రాల్.. పల్లీల్లో 71% ఉంటే బాదంలో 73% ఉంటుంది. ఇక కార్బొహైడ్రేట్ల విషయానికి వస్తే.. రెండిటిలోనూ సమానంగా 13 శాతం లభిస్తాయి. ప్రొటీన్లు, పిండిపదార్థాలు, కొవ్వులు.. పల్లీలు, బాదం రెండిట్లోనూ ఇంచుమించు సమానంగానే లభిస్తాయి.
అన్నీ సమానంగా ఉన్నా.. ధరలో మాత్రం బాదంతో పోలిస్తే పల్లీలు అగ్గువకు దొరుకుతాయి. కాబట్టి, రోజూ బాదం తినలేనివారు.. దాని స్థానంలో నానబెట్టిన పల్లీలు తీసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే.. బాదంతో సమానమైన లాభాలను పొందొచ్చు.