Peanuts | చలికాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే శరీరంలో వేడిని పుట్టించే ఆహారాలను తీసుకుంటుంటారు. దీంతోపాటు ఉన్ని దుస్తులను కూడా ధరిస్తుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు, మనకు ఈ సీజన్లో అవసరం అయిన పోషణను అందిస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇక చలికాలంలో తినాల్సిన అతి ముఖ్యమైన ఆహారాల్లో పల్లీలు కూడా ఒకటి. పల్లీలు అంటే చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. కానీ వీటిని ఈ సీజన్లో తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలను చలికాలంలో తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది.
చాలా మంది చలికాలంలో బద్దకంగా ఉంటారు. పనిచేయాలంటే ఉత్సాహం ఉండదు. అలాంటప్పుడు కాసిన్ని పల్లీలను తినాలి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పల్లీలను ఉడకబెట్టి తింటే రోజంతటికీ కావల్సిన శక్తి, పోషకాలు లభిస్తాయి. దీంతో రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట అనేవి ఉండవు. కనుక పల్లీలను చలికాలం తింటే బద్దకాన్ని పోగొట్టుకోవచ్చు. పల్లీలను తినడం వల్ల మనకు విటమిన్ ఇ లభిస్తుంది. ఇది మన శరరీంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. చలికాలంలో మనకు సహజంగానే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కానీ పల్లీలను రోజూ గుప్పెడు తింటే ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి సైతం పల్లీలు ఎంతో మేలు చేస్తాయి.
చలికాలంలో మన చర్మం పగులుతుంది. కానీ పల్లీలను తింటుంటే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మం పగలకుండా నిరోధించవచ్చు. పల్లీలలో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీంతో చర్మం మృదువుగా మారి పగలకుండా ఉంటుంది. చర్మానికి రక్షణ లభిస్తుంది. చర్మంలో సహజసిద్ధమైన కాంతి పెరుగుతుంది. పల్లీలలో మన శరీరానికి ఎంతో అవసరం అయిన మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు పల్లీలను తింటుంటే త్వరగా కోలుకోవచ్చు.
పల్లీలను తినడం వల్ల మన శరీరంలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఇది మన మూడ్‌ను మారుస్తుంది. దీంతో మనం ఉత్సాహంగా ఉంటాం. చురుగ్గా పనిచేస్తాం. చలికాలంలో వచ్చే బద్దకం పోతుంది. అలాగే మూడ్ మారి మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీని వల్ల రాత్రి పూట చక్కగా నిద్రపడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
పల్లీలను తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అందువల్ల పల్లీలను మనం ఈ సీజన్లో తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. పల్లీలను తింటే రక్తంలోని షుగర్ స్థాయిలు కూడా తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేసే విషయం. ఇలా పల్లీలను చలికాలంలో తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. కనుక వీటిని ఈ సీజన్లో తినడం మరిచిపోకండి.