Apps:
Follow us on:

Parenting Tips | చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి?

1/7Parenting Tips | పెద్దలైనా, పిల్లలైనా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. అప్పుడే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు. అయితే, పసిపిల్లలకు ఇమ్యూన్‌ సెల్స్‌ తల్లి పాల ద్వారా వస్తాయి. అలాగే, వయసుకు తగిన వ్యాక్సిన్లు వేయిస్తుంటే, చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. అలాగే పోషకాహారం అందించడం ద్వారా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
2/7తల్లి పాలలోని కొలోస్ట్రమ్‌ పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది. పుట్టినప్పటి నుంచీ కనీసం ఆరు నెలలపాటు తల్లి పాలు తాగితే వాళ్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి.
3/7ఖనిజ లవణాలన్నిటిలోకి జింక్‌ పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇది బీన్స్‌, నట్స్‌ వంటి ప్రొటీన్‌ ఫుడ్స్‌లో పుష్కలం.
4/7తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కణాలను పాడవకుండా కాపాడుతాయి. వ్యాధుల బారినుంచి రక్షిస్తాయి. బెర్రీస్‌, బ్రొకోలీ, పాలకూర, ఆవాల ఆకులు (మస్టర్డ్‌ లీవ్స్‌) మొదలైన వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ చాలా ఉంటాయి.
5/7గట్‌ హెల్త్‌ కూడా చాలా ముఖ్యం. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటేనే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరగాలన్నా, పేగు మార్గాలు దృఢంగా ఉండాలన్నా ప్రోబయాటిక్స్‌ పుష్కలంగా ఉండే ఆహారం పిల్లలకు ఇవ్వాలి. రోజూ పెరుగుతోపాటు ఒక పండు కచ్చితంగా పెట్టాలి. కొంచెం పెద్ద పిల్లలైతే పెరుగులో క్యారెట్‌, కీరా తరుగు వేసి ఇస్తే ఇష్టంగా తింటారు.
6/7పిల్లలకు రోజూ 10 నుంచి 14 గంటల నిద్ర అవసరం. అది కూడా మధ్యలో ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి. రాత్రి నిద్ర పుచ్చే ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయించడం, లైట్‌గా మసాజ్‌ చేయడం, కొంతసేపు పుస్తకం చదివించడం వంటివి చేయాలి. సరిపడా నిద్రపోయే పిల్లలు అంత త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడరు.
7/7యాంటీ బయాటిక్స్‌ త్వరగా పని చేస్తాయన్న మాట నిజమే. అయినా సరే, వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, అవి శరీరంలోని మంచి బ్యాక్టీరియాను పూర్తిగా తొలగిస్తాయి. దానివల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.