సుగంధ ద్రవ్యాలలో నోటి ఆరోగ్యానికి లవంగం ఉపయోగిస్తాం. సంప్రదాయ వైద్యంలోని లవంగం ప్రయోజనాలను నేటి వైద్య విధానాలు కూడా బలపరుస్తున్నాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియాను నివారించడం, దుర్వాసన పోగొట్టడమే కాదు చిగుళ్లలో వాపుని తగ్గిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిలో చిన్న చిన్న దంత సమస్యలు వచ్చినప్పుడు, అత్యవసరమని భావించినప్పుడు లవంగాన్ని ఆశ్రయిస్తారు. అదంతా సమస్య అనుకుంటే మార్కెట్లో దొరికే లవంగం నూనెను ఉపయోగిస్తారు. మోతాదు మించితే ఔషధం కూడా విషంలా పనిచేస్తుందంటారు కదా. ఈ నూనె కూడా అతిగా వాడితే అనర్థాలుంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.