oximeter scam : అవునా? పెన్నుకు కూడా ఆక్సిజన్ లెవల్స్ ఉన్నాయా? అసలు పల్స్ ఆక్సీమీటర్ కరెక్ట్‌గానే పనిచేస్తుందా?
oximeter scam | ఆక్సీమీటర్లో మనిషి వేలుకు బదులు ఒక పెన్ను ఉంచినా సరే దాని ఆక్సిజన్, పల్స్ రేట్లను చూపిస్తుండటం ఆ వీడియోలో కనిపించడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

oximeter scam | కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఆక్సీమీటర్ గురించి అందరికీ తెలిసిపోయింది ! శరీరంలో ఆక్సిజన్ స్థాయులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జనాలు ఇప్పుడు వీటిని ఇంటికి తెచ్చుకుంటున్నారు ! ఇలాంటి సమయంలో ఆక్సీమీటర్ పనితీరుపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆక్సీమీటర్ పనితీరును సవాలు చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆక్సీమీటర్లో మనిషి వేలుకు బదులు ఒక పెన్ను ఉంచినా సరే దాని ఆక్సిజన్, పల్స్ రేట్లను చూపిస్తుండటం ఆ వీడియోలో కనిపించడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అసలు పల్స్ ఆక్సీమీటర్లను నమ్మోచ్చా? లేదా? అనే అనుమానంలో పడిపోతున్నారు. మరి నిజంగానే ఆక్సీమీటర్లో పెన్ను ఉంచినా రీడింగ్ చూపిస్తుందా? ఆ వీడియోలో నిజమెంత ఉంది? ఒకసారి చూద్దాం..

అసలు వీడియో ఏంటి?
ఒక చిన్నారి తన పెన్నును ఆక్సీమీటర్లో ఉంచి దాన్ని ఆన్ చేశాడు. అప్పుడు పల్స్ 200, ఆక్సిజన్ లెవల్స్ 98 ఉన్నట్లుగా రీడింగ్ చూపించింది. దీన్ని ఫేస్బుక్లో పోస్టు చేసిన ఓ వ్యక్తి.. ” ఓహ్ స్కెచ్ పెన్నుకు కూడా హార్ట్ బీట్ ఉందే ! వందేమాతరం ఫ్రెండ్స్ ! స్కెచ్ పెన్నుకు కూడా హార్ట్‌బీట్, ఆక్సిజన్ లెవల్స్ ఉన్నాయి ! అనవసరంగా జనాల్ని మీడియా భయపెట్టిస్తుంది ! ఏం మాయ ఇది ! ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయని ఎందుకు భయపెట్టిస్తున్నారు ? ప్రజలారా జాగ్రత్తగా ఉండండి ! అని చెప్పుకొచ్చాడు. అలాగే.. ఇందులో ఏ ట్రిక్ లేదు. ఇదంతా oximeter scam ” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఫేస్బుక్, వాట్సాప్‌లో ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

అసలు ఆక్సీమీటర్ ఎలా పనిచేస్తుంది?
అసలు ఈ వీడియో నిజమో కాదో తెలియాలంటే ముందు ఆక్సీమీటర్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఆక్సీమీటర్లో రెండు రకాల లైట్లు ఉంటాయి. అందులో ఒకటి రెడ్ లైట్.. ఇంకోటి ఇన్ఫ్రారెడ్ లైట్. రక్తంలో ఉండే ఆక్సిజన్ ఇన్ఫ్రారెడ్ లైట్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. ఎక్కువ రెడ్ లైట్‌ను అవతలివైపు పంపించేస్తుంది. శరీరంలో కావాల్సినంత ఆక్సిజన్ లేకపోతే రెడ్ లైట్‌తో పాటు ఇన్ఫ్రారెడ్ లైట్ కూడా అవతలివైపు వచ్చేస్తుంది. మన చేతిలో నుంచి అవతలివైపు ప్రసరించిన రెండు కాంతులను సెన్సర్ గ్రహించి కొంత రీడింగ్ చూపిస్తుంది.

నిజంగానే పెన్ను ఆక్సిజన్ లెవల్స్ చూపిస్తుందా?
అవును !! పెన్నును ఆక్సీమీటర్లో ఉంచినా ఆక్సిజన్ లెవల్స్, పల్స్‌ను చూపిస్తుంది. అని న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ ఇషాన్ గుప్తా తెలిపారు. అది ఎలాగో కూడా కారణం వివరించారు. ” పెన్ను లేదా వేరే ఏ వస్తువును అయినా సరే ఆక్సీమీటర్లో ఉంచినప్పుడు.. అందులోని ఫొటో సెన్సర్ ఎంతో కొంత లైట్‌ను గుర్తిస్తుంది. దానికి ఎంతో కొంత రీడింగ్‌ను చూపిస్తుంది. ఎందుకంటే ఆక్సీమీటర్లో ఉంచింది మనిషి వేలా లేదా ఇంకేదైనా వస్తువా అనేది దానికి తెలియదు. అది ఏదైనప్పటికీ మనిషి వేలు అనే అనుకుంటుంది. కాబట్టి ఒకవేళ పెన్నును ఉంచినా అందులో నుంచి బయటకు ప్రసరించే రెడ్, ఇన్ఫ్రారెడ్ లైట్‌ను గ్రహించిన సెన్సర్ ఎంతో కొంత రీడింగ్ చూపిస్తుంది. అలా అని ఆక్సీమీటర్ తప్పు అనడం కరెక్ట్ కాదు.” అని ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
COVID-19 : పది సెకన్లు శ్వాస బిగబట్టగలిగితే కరోనా లేనట్లేనా?
COVID-19 doubts : ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా?
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
COVID Vaccine : వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? గుండెజబ్బులు, షుగర్ ఉంటే టీకా తీసుకోవచ్చా?
Coronavirus Recovery : కరోనా తగ్గినా వ్యాయామం చేయాల్సిందే
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID-19 doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
Coronavirus Recoveryబోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

