వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే.. అంటే, గర్భస్థ దశలోనే పిండం ఆరోగ్యాన్ని బేరీజు వేయగల సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అవసరమైతే ఆపిండానికి వైద్యం అందించవచ్చు, శస్త్ర చికిత్సలూ చేయవచ్చు. దీనివల్ల గుండె రుగ్మతలను దాటుకుని, లోపాలను అధిగమించి.. పరిపూర్ణ ఆరోగ్యంతో భూమి మీదికి వచ్చేస్తారు పసిబిడ్డలు.
కొంతమంది చిన్నారులకు పుట్టుకతోనే గుండె సమస్యలు వస్తున్నాయి. పెరిగి పెద్దవుతున్న దశలో అవి బయటపడుతున్నాయి. ఆ రుగ్మతలను సకాలంలో గుర్తించకపోతే ప్రాణాల మీదికి రావచ్చు. పిల్లల్లో హృద్రోగాలు రెండు రకాలు. కొన్నిటిని పూర్తిగా నయం చేయవచ్చు. కొన్నిటిని పాక్షికంగా దూరం చేయవచ్చు. సమస్య తీవ్రత, వ్యాధి దశ, రోగి ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. పూర్తిగా నయం చేయగలిగే గుండె సమస్యలు ఏడు రకాలు..
వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అనేది పుట్టుకతో వచ్చే గుండె సమస్య. శిశువుల గుండెలకు జన్మతః రంధ్రాలు ఉంటాయి. వీటిని పూడ్చేయగల అధునాతన చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉంది. సమస్యను సకాలంలో గుర్తిస్తే నూటికి నూరుశాతం సక్సెస్ రేటు ఉంటుంది. చికిత్స తరువాత పిల్లలు సాధారణ జీవితం గడపవచ్చు.
తల్లులలో లూపస్ సమస్య ఉంటే తరచూ అబార్షన్స్ అవుతాయి. అంతేకాకుండా బిడ్డ గర్భస్థ దశలోనే హృదయ స్పందన తగ్గిపోతుంది. సాధారణంగా పిండం హృదయ స్పందన రేటు నిమిషానికి 120-150 వరకూ ఉండాలి. కానీ ఈ సమస్య ఉన్నవారిలో 60 కంటే తక్కువకు పడిపోతుంది. అలాంటి గర్భిణులకు నిపుణుల పర్యవేక్షణలో మందులు వాడాలి. బిడ్డ జన్మించిన తరువాత పేస్‌మేకర్ అమర్చాల్సి రావచ్చు.
బిడ్డ పుట్టిన ఒకటి రెండు నెలల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి యాంజియోగ్రామ్ పద్ధతిలో బటన్ (డివైజ్) వేస్తారు. ఏ విధానంలో అయినా 95 శాతం సక్సెస్ రేటు ఉంటుంది. రెండోసారి సర్జరీ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు.
ఈ సమస్యలో శిశువు గుండె ప్రధాన రక్తనాళంలో అవరోధం ఏర్పడుతుంది. ఈ జబ్బు కారణాలు, లక్షణాలు వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్‌ను పోలి ఉంటాయి. ఈ సమస్యను కూడా గర్భస్థ దశలోనే గుర్తించవచ్చు.
ఈ సమస్య ఉన్న శిశువుకు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ రుగ్మతను సైతం పిండస్థ దశలోనే గుర్తించవచ్చు.
పై రెండు సమస్యలనూ గర్భస్థ దశలోనే గుర్తించి, పిండానికి చికిత్స చేయవచ్చు. తల్లి పొత్తికడుపు నుంచి గర్భం లోపలికి ఫీటల్ అనెస్తీషియా ఇచ్చి, బెలూన్ సాయంతో బ్లాక్ అయిన భాగాలను ఓపెన్ చేస్తారు.
ఇది శరీరంలోని ప్రధాన రక్తనాళానికి సంబంధించిన సమస్య. గుండె ఎడమ కర్ణిక నుంచి మొదలై, మెదడుకు రక్తం సరఫరా చేసిన తరువాత.. మళ్లీ కిందికి వచ్చే భాగంలో రక్తనాళం బ్లాక్ అవుతుంది.
థొరకాటమీ సర్జరీ ద్వారా జబ్బును నయం చేయవచ్చు. బిడ్డ జన్మించిన మొదటి వారంలో సర్జరీ చేసి బ్లాక్‌ను ఓపెన్ చేస్తారు.
సాధారణంగా పిల్లల్లో ఆక్సిజన్ శాచురేషన్ రేటు 98 నుంచి 100 శాతం ఉంటుంది. కానీ బ్లూ బేబీస్‌లో అది 80 శాతం కంటే తక్కువ. పిల్లలు ఏడ్చినప్పుడు మరింతగా పడిపోతుంది. దీంతో నీలం రంగులో కనిపిస్తారు. కాబట్టే వారిని బ్లూ బేబీస్ అంటారు. వైద్యపరిభాషలో ‘టెట్రాలజీ ఆఫ్ ఫాలెట్’గా వ్యవహరిస్తారు. వీరిలో గుండెలో రంధ్రంతో పాటు ఊపిరితిత్తుల్లో బ్లాక్ ఉంటుంది. ఫలితంగా చెడురక్తం, మంచిరక్తం కలిసిపోయి రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది.
ఈ జబ్బుతో బాధపడే శిశువులకు.. పుట్టిన ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా గుండెలోని చెడు రక్తం కుడివైపు గదులకు వచ్చి, అట్నుంచి ఊపిరితిత్తులకు వెళ్తుంది. అక్కడ శుభ్రమై, గుండె ఎడమ గదులకు వచ్చి, అక్కడి నుంచి వివిధ శరీర భాగాలకు వెళ్తుంది. కానీ ఈ సమస్య ఉన్నవారిలో చెడురక్తం కుడివైపునకు వచ్చి.. ఊపిరితిత్తులకు వెళ్లకుండా మళ్లీ శరీరానికి వెళ్తుంది. అంతే కాకుండా ఊపిరితిత్తుల నుంచి వచ్చిన రక్తం తిరిగి ఊపిరితిత్తుల్లోకే వెళ్తుంది.
ఈ సమస్య గర్భస్థ దశలో కానీ, బిడ్డ పుట్టిన తరువాత కానీ రావచ్చు. గర్భస్థ దశలోనే వస్తే.. అబార్షన్ జరిగే ప్రమాదం ఉంది. సమస్యను గర్భస్థ దశలోనే గుర్తిస్తే తల్లి ద్వారా చికిత్స చేయవచ్చు. ప్లసెంటా ద్వారా వైద్యం అందిస్తారు కాబట్టి దీన్ని ప్లాజంటల్ థెరపీ అంటారు. గర్భధారణ సమయంలో తల్లి గర్భాశయంలో వృద్ధిచెందే సమస్య ఇది. సందర్భాన్ని బట్టి పిల్లలకు షాక్ ఇస్తారు.
ఈ వ్యాధితో బాధపడే శిశువులకు.. పుట్టిన మొదటి వారంలోపు ఓపెన్ హార్ట్ సర్జరీ (ఆర్టీరియల్ స్విచ్) చేయాల్సి ఉంటుంది. లేకపోతే మొదటి నెలలోనే మృతిచెందే ఆస్కారం ఉంది.
మధుమేహం నియంత్రణలో లేని గర్భిణులకు ఇలాంటి పిల్లలు పుడతారు.
సాధారణంగా.. ఊపిరితిత్తులకు వెళ్లిన రక్తం శుద్ధి జరిగి ఎడమవైపు రావాలి. కానీ ఇక్కడ మాత్రం కుడివైపున ఉండే చెడు రక్తంలో కలుస్తుంది. ఇందులో కూడా బిడ్డ పుట్టిన మూడు నెలల్లోపు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది.
ఈ సమస్యకు ప్రత్యేకమైన కారణాలంటూ ఉండవు. కాలుష్యం, పోషకాల లేమి పాత్రనూ కాదనలేం. సర్జరీ తరువాత బిడ్డ సాధారణ జీవనం గడపవచ్చు.
ఈ వ్యాధులను ‘సింగిల్ వెంట్రిక్యులర్ టైప్ డిసీజెస్’ అంటారు. ఈ సమస్యలు ఉన్న వారిలో గుండెలో నాలుగు గదులకు బదులు మూడే ఉంటాయి. అంటే, ఒక గది ఉండదు. ఉన్నా సరిగ్గా ఏర్పడి ఉండదు. కుడి వైపు గది లేకపోతే దానిని ప్రైకట్పిట్ ఎట్రీషియా, హైపో ప్లాస్టిక్ రైట్ హార్ట్ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. ఎడమ వైపు గది లేకపోతే దానిని హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అంటారు.
జన్యుపరమైన సమస్యలు. వీటినే హెటిరోటాగ్జీ సిండ్రోమ్స్ అంటారు.
ఇందులో కూడా శిశువులు నీలంగా మారతారు.
పుట్టిన నెలలోపు ఒకసారి, ఆరు నెలల తరువాత ఒకసారి, నాలుగు నుంచి ఐదు ఏండ్ల మధ్యలో ఒకసారి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ మూడూ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీలే. 20 శాతం రిస్క్ ఉంటుంది. వీటిని పాలియేటివ్ సర్జరీస్ అనీ అంటారు. ఎందుకంటే, రక్తసరఫరాను బైపాస్ చేయగలమే కానీ, సమస్యను పూర్తిగా పరిష్కరించలేం.
ఆరు నెలల్లోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ.
బిడ్డకు థయామిన్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని నీళ్లు, పాలలో కలిపి ఇస్తారు. రెండు నెలల పాటు వాడితే సమస్య తీరుతుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు వచ్చే రుగ్మతలను ఎదుగుదలలో భాగంగానే భావిస్తారు. వైద్యులను సంప్రదించే ప్రయత్నమే చేయరు. దీంతో ఆ జబ్బు ఏదో ఓ దశలో తీవ్రరూపం ధరిస్తుంది. కాబట్టి, పసిబిడ్డలో ఏ అసాధారణమైన మార్పు కనిపించినా.. నిపుణులను సంప్రదించడం ఉత్తమం. లేకపోతే, భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు.
– డాక్టర్ భార్గవి దూలిపూడి కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్
…?మహేశ్వర్‌రావు బండారి