మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Jan 26, 2020 , 22:31:49

బరువు ఎక్కువైతే సంతానం ఎలా?

బరువు ఎక్కువైతే సంతానం ఎలా?

నాకు 35 ఏళ్లు. పెండ్లయి 4 సంవత్సరాలవుతున్నది. మూడేండ్లుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ సక్సెస్‌ కావడం లేదు. మాకు ఊబకాయం ఉండడం వల్ల సమస్యలు ఉండొచ్చని మా బంధువులంటున్నారు. నా బిఎంఐ 30, నా భార్య బిఎంఐ 28. మేము ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - రాహుల్‌, హైదరాబాద్‌

ఊబకాయం ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. స్త్రీ, పురుషులిద్దరి సంతాన సామర్థ్యం దీని వల్ల ప్రభావితం కావొచ్చు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల అంగస్తంభన సమస్యలు రావొచ్చు. టెస్టోస్టిరాన్‌ సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ ఊబకాయం వల్ల అంగస్తంభన సమస్య ఉంటుంది. వీర్యకణాల సంఖ్య, చలనం కూడా తగ్గడానికి అవకాశముంటుంది. తొడల భాగంలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా ఎక్కువ అవుతుంది.


దాంతో వీర్యకణాల ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. బరువు ఎక్కువగా ఉన్న అమ్మాయిల్లో నెలసరి, అండోత్పత్తి సమస్యలు వస్తాయి. హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్న మహిళల కన్నా ఊబకాయం ఉన్న స్త్రీలు గర్భం దాల్చడానికి కష్టమవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ గర్భస్రావం, డయాబెటిస్‌ రావొచ్చు. మీ సమస్యకు జీవనశైలి మార్పులు చేసుకోవడం అత్యవసరం. ఐవిఎఫ్‌ మంచి పరిష్కారం. 


logo