Nuts For Hair Growth | చలికాలంలో సహజంగానే మన శిరోజాలు చిట్లుతుంటాయి. జుట్టు బాగా రాలుతుంది. అలాగే చుండ్రు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో చలా మంది ఖరీదైన చికిత్సా మార్గాలను ఎంచుకుకుంటారు. ఖరీదైన షాంపూలు, క్రీములు వాడడం చేస్తుంటారు. అయితే ఇదంతా చేయాల్సిన పనిలేదు. కేవలం ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. దాంతో శిరోజాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శిరోజాల సమస్యల నుంచి బయట పడవచ్చు. చలికాలంలో ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో పలు రకాల నట్స్‌ను తీసుకోవడం వల్ల శిరోజాలకు చక్కని పోషణ లభిస్తుందని, దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బాదంపప్పులో బయోటిన్, విటమిన్ ఇ, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి. జుట్టును దృఢంగా ఉండేలా చేస్తాయి. దీంతో జుట్టు సహజంగా కాంతివంతంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన జుట్టు కావాలంటే రోజూ బాదంపప్పును తినాలి. కేవలం గుప్పెడు బాదంపప్పును నీటిలో నానబెట్టి రోజూ ఉదయం లేదా సాయంత్రం తినడం వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతోపాటు చుండ్రు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే శిరోజాలను ఆరోగ్యంగా ఉంచేందుకు జీడిపప్పు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. జీడిపప్పులో జింక్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. శిరోజాలు దృఢంగా మారుతాయి. చలికాలంలో వచ్చే జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
హేజల్‌నట్స్ గురించి చాలా మందికి తెలియదు. కానీ జుట్టు సమస్యలను తగ్గించేందుకు ఈ నట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నట్స్‌లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టును పొడిబారకుండా రక్షిస్తాయి. దీంతో చలికాలంలో జుట్టు తేమగా ఉంటుంది. అలాగే శిరోజాలు డ్యామేజ్ అవకుండా ఈ నట్స్ రక్షిస్తాయి. శిరోజాలను ఈ నట్స్ కాంతివంతంగా ఉంచుతాయి. చలికాలంలో ఈ నట్స్‌ను రోజూ గుప్పెడు తినడం వల్ల శిరోజాలకు ఎంతగానో మేలు జరుగుతుంది.
మార్కెట్లో మనకు లభించే పలు రకాల నట్స్‌లో బ్రెజిల్ నట్స్ కూడా ఒకటి. వీటిని రోజుకు ఐదారు తింటే చాలు శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ నట్స్‌లో సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో చలికాలంలో జుట్టే రాలే సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ నట్స్‌ను తినడం వల్ల శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరగడంతోపాటు కాంతివంతంగా మారుతాయి. అలాగే వాల్ నట్స్‌ను తినడం వల్ల కూడా శిరోజాలను సంరక్షించుకోవచ్చు. ఈ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను లోపలి నుంచి దృఢంగా ఉండేలా చేస్తాయి. అలాగే జుట్టును దృఢంగా మారుస్తాయి. కనుక వాల్ నట్స్‌ను ఈ సీజన్లో రోజూ తిన్నా కూడా శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.