Coffee | కాఫీకి ఎవరెవరు దూరంగా ఉండాలంటే..!
మనలో చాలా మందికి రోజూ ఉదయాన్నే కాఫీ (Coffee) తాగనిదే రోజు ప్రారంభం కాదు. ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పలు అధ్యయనాలు వెల్లడించినా కొందరు కాఫీకి దూరంగా ఉండాలని న్యూట్రిషనిస్ట్ సిమ్రన్ చోప్రా సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ : మనలో చాలా మందికి రోజూ ఉదయాన్నే కాఫీ (Coffee) తాగనిదే రోజు ప్రారంభం కాదు. ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పలు అధ్యయనాలు వెల్లడించినా కొందరు కాఫీకి దూరంగా ఉండాలని న్యూట్రిషనిస్ట్ సిమ్రన్ చోప్రా సూచిస్తున్నారు. జీవక్రియల వేగం మందగించినవారు, యాంగ్జైటీతో బాధపడే వారు, గర్భిణులు కాఫీ తీసుకోకుండా ఉండటం మేలని ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు.
కాఫీ తీసుకున్న తర్వాత జీవక్రియల వేగం మందకొడిగా ఉన్నవారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారని చోప్రా రాసుకొచ్చారు. వీరు కాఫీ తాగిన 9 గంటల వరకూ గాబరా, ఆందోళనగా ఉండటం వంటి ప్రతికూల ప్రభావాలకు లోనవుతారని, ఇక జీవక్రియల వేగం అధికంగా ఉన్న వారికి కాఫీ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుందని అన్నారు. వీరితో పాటు గర్భిణులు కూడా కాఫీని పరిమిత మోతాదులో తీసుకోవాలని సూచించారు.
ఇక మితంగా కాఫీ తాగే వారిలో జ్ఞాపకశక్తి పెంపొందడం వంటి పలు ప్రయోజనాలు చేకూరుతాయని ఈ వీడియోలో చోప్రా చెప్పారు. రోజుకు 1 లేదా 2 కప్పుల కాఫీ తాగడం దీర్ఘకాలంలో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కాఫీతో పాటు కెఫీన్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను తీసుకోవడం మంచిది కాదని, ఇది స్ట్రెస్ లెవెల్స్, సెరటోనిన్ లెవెల్స్‌పై ప్రభావం చూపతుందని చోప్రా చెప్పుకొచ్చారు.
Read More :
Retail Market | దేశీయ రిటైల్ మార్కెట్‌కు పండుగ కళ.. రూ.3.75 లక్షల కోట్ల అమ్మకాలు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

