Virat Kohlis Diet Secret : విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్‌గానే కాకుండా ఆరోగ్యం, ఫిట్నెస్ ఔత్సాహికులకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంటారు. ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి కోహ్లీ చాలా కేర్ తీసుకుంటారు. ఇక న్యూట్రిషనిస్ట్ నేహ సహాయ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో విరాట్ కోహ్లీ ఆహార రహస్యాలను వెల్లడించారు. కోహ్లీ తన డైట్లో అల్కలైన్ ఫుడ్స్‌కు చోటిస్తారని ఆమె చెప్పుకొచ్చారు. వయసు పెరిగే కొద్దీ మనలో ఎముకలు బలహీనమవుతుంటాయి.
శరీరంలో సరైన పీహెచ్ లెవెల్స్ నిర్వహించేందుకు అనువైన అల్కలైన్ ఆహారంతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. అల్కాలైన్ ఆహారం ఆరోగ్యానికి ఉపకరించడంతో పాటు వ్యాధులను దరిచేరనివ్వదు. మరోవైపు అసిడిక్ డైట్ జీవక్రియల వేగం మందగించేలా చేయడంతో పలు సమస్యలు తలెత్తుతాయి. అయితే అల్కలైన్, అసిడిక్ ఆహారం మధ్య సమతూకం పాటించేలా చూసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జీర్ణక్రియ సజావుగా సాగాలంటే మన కడుపులో ఆమ్లత్వం ఉండాలి. ఇక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అల్కాలైన్ ఆహారంలో ముందుగా రోజూ ఉదయాన్నే వెజిటబుల్ జ్యూస్‌తో రోజు ప్రారంభించడం మేలని న్యూట్రిషనిస్ట్ నేహ చెప్పారు. ఇక అవకాడో, అరటి, బెర్రీస్, పుచ్చకాయల్లో అల్కలైన్ అధికంగా ఉంటుంది. బాదం, అవిసె గింజలు, చియా సీడ్స్, మిల్లెట్స్, బీన్స్ వంటివి తీసుకోవడం మేలు.
Read More :
Watch: చిరుతను చంపి.. తలకిందులుగా చెట్టుకు వేలాడదీసిన జనం