లక్నో: గ్రామంలో సంచరిస్తున్న చిరుతను గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ చిరుతను చంపి తలకిందులుగా చెట్టుకు వేలాడదీశారు. (Leopard Killed, Hanged Upside Down ) ఈ దారుణానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కనియన్ గ్రామంలో తిరుగుతున్న చిరుతను మంగళవారం స్థానికులు బంధించారు. ఆపై ఆ చిరుతను చంపారు. తాడుతో కట్టి తలకిందులుగా చెట్టుకు వేలాడదీశారు.
కాగా, ఈ విషయం తెలిసిన అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆ చిరుతను ఎవరు చంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ముందు రోజు ఒక చిరుతను అటవీశాఖ సిబ్బంది బంధించారు.
మరోవైపు చిరుతను చంపి తలకిందులుగా చెట్టుకు వేలాడదీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై మండిపడ్డారు. చిరుతను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
शामली
➡शामली में पेड़ पर लटका मिला तेंदुए का शव
➡शव के पास एक और तेंदुए के होने की चर्चा
➡वन विभाग की टीम ने शव कब्जे में लिया
➡थाना कांधला क्षेत्र कनियान गांव का मामला#Shamli
देखें वीडियो : https://t.co/bJkLif8Qrd pic.twitter.com/q2byL9t2to
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 13, 2024