Health Tips | ఆహార పదార్ధాలను ఎంతో జాగ్రత్తగా శుచిగా, రుచిగా తయారుచేసినా వాటిలో సాల్ట్ పడనిదే సరైన టేస్ట్, ఫ్లేవర్ రాదు. మన కిచెన్‌లో నిత్యం వాడే సాల్ట్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పరిమిత మోతాదులో తీసుకుంటే వాటిలోని పోషకాలు ప్రయోజనకరంగా అందుకోవచ్చు. సాల్ట్ కేవలం టేస్ట్ కోసమే కాదు అది మన ఆరోగ్యానికి అత్యవసరమే కాకుండా ఎన్నో శారీరక విధులను నిర్వర్తించే క్రమంలో సపోర్ట్ చేస్తుంది. అయితే అన్ని రకాల సాల్ట్స్ ఒకేలా ఉండవు, వీటిలో దేన్ని మనం రోజువారీ ఉపయోగానికి పరిగణనలోకి తీసుకోవాలనే విషయంలో కొంత డైలమా ఎదురవుతుంది. అయితే న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ సరైన సాల్ట్ ఎంపికపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
సెల్టిక్ సాల్ట్
సెల్టిక్ సాల్ట్‌లో రెగ్యులర్ సాల్ట్‌తో పోలిస్తే సోడియం తక్కువగా ఉంటుంది. అయితే పింక్ సాల్ట్, కోషర్ సాల్ట్ కంటే సోడియం కొంచెం అధికంగా ఉంటుంది.
బ్లాక్ సాల్ట్
బ్లాక్ సాల్ట్‌లో టేబుల్ సాల్ట్ కంటే సోడియం తక్కువగా ఉంటుంది. కడుపుబ్బరం, అజీర్తి, కడుపునొప్పి, వికారం, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడేవారు బ్లాక్ సాల్ట్ వాడితే మేలు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి.
కోషర్ సాల్ట్
ఈ సాల్ట్ తక్కువ రిఫైన్డ్ కావడంతో సాల్టీ టేస్ట్ తక్కువగా ఉంటుంది. ఇందులో అయొడిన్ తక్కువగా ఉండటంతో పాటు రెగ్యులర్ టేబుల్ సాల్ట్‌తో పోలిస్తే సోడియం కంటెంట్ తక్కువ.
లో సోడియం సాల్ట్
ఈ వెరైటీ సాల్ట్‌లో సోడియం తక్కువగా, పొటాషియం అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు, ఉప్పు తక్కువగా తినాలనుకునే వారు ఈ సాల్ట్‌ను ట్రై చేయవచ్చు.
పింక్ సాల్ట్
పోషకాలు అధికంగా ఉండే పింక్ సాల్ట్ తరచూ తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవడంతో పాటు కండరాల నొప్పులను తగ్గే అవకాశం ఉంది. కణాల్లో పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
రెగ్యులర్ సాల్ట్
మనం దైనందిన జీవితంలో అధికంగా ఉపయోగించే వైట్ సాల్ట్‌లో అయొడిన్ అధికంగా ఉంటుంది. అయితే దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం మేలు. ఈ సాల్ట్‌ను ఓ వ్యక్తి రోజుకు 5 గ్రాములకు మించి తీసుకోరాదు.
సీ సాల్ట్
ఇక పోషకాలు మెండుగా ఉండే సీ సాల్ట్‌ను కూడా పలువురు ఉపయోగిస్తారు. అయితే ఈ సాల్ట్ నీటిలో అంత సులభంగా కరగదు.
ఇవాళ మార్కెట్లో ఎన్నో రకాల సాల్ట్‌లు అందుబాటులో ఉన్నాయని అంజలీ ముఖర్జీ చెబుతూ తాను వంట కోసం అధికంగా పింక్ సాల్ట్ ఉపయోగిస్తానని తెలిపారు. ఆయా సాల్ట్స్‌లో ఉండే పదార్ధాలకు అనుగుణంగా తమకు అనువైన సాల్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మీ అవసరాలకు తగినట్టుగా ఆయా సాల్ట్స్‌ను మిక్స్ చేసుకోవచ్చని ఆమె సూచిస్తున్నారు. హృద్రోగాలు, అధిక రక్తపోటుతో బాధపడేవారు పింక్ సాల్ట్ వాడితే మేలని చెబుతున్నారు.
Read More :
Nagababu Konidela | అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయండి.. నాగబాబు సెటైర్లు