Health Tips : వింటర్లో మరే సీజన్ అయినా వేడి వేడి సూప్ అంటే ఇష్టపడని వారుండరు. జీర్ణశక్తితో పాటు బరువు తగ్గడం వరకూ ఎన్నో ఆరోగ్యప్రయోజనాలనూ సూప్స్ ఆఫర్ చేస్తాయి. చికెన్ సూప్, టమాట సూప్, స్వీట్ కార్న్ సూప్ ఇలా ఎన్నో వెరైటీల సూప్‌లు అందుబాటులో ఉన్నాయి.
అయితే రుచితో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందించే మునగ సూప్‌ను ట్రై చేయడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ సూప్‌లకు భిన్నంగా ఇది మెరుగైన మార్పును అందిస్తుంది. టమాటా, పసుపు, అల్లం, నీటితో పాటు మునగకాయలతో కుక్ చేసే ఈ సూప్‌లో కొద్దిగా నెయ్యి, జీలకర్ర జోడిస్తే లంచ్, డిన్నర్లో ఈ సూప్‌ను ఆస్వాదించవచ్చు.
మునగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న విషయం తెలిసిందే. మునగలో యాంటీఆక్సిడెంట్లు, కీలక విటమిన్స్, మినరల్స్ ఉండటంతో శక్తినిచ్చే పానీయంగా మేలు చేస్తున్నారు. మునగను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఇది మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేయడంతో పాటు వాపు ప్ర్రక్రియనూ నివారిస్తుంది.
Read More :