Moong Dal | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పోషకాలు అన్నీ ఒకే ఆహార పదార్థంలో లభించవు. ఇందుకు గాను మనం వేర్వేరు ఆహారాలను రోజూ తినాలి. కానీ కొన్ని రకాల ఫుడ్స్‌లో మాత్రం పోషకాలు దాదాపుగా అన్నీ మనకు లభిస్తాయి. అవి చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిల్లో పెసలు కూడా ఒకటి. పెసలలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ దాదాపుగా వీటిల్లో ఉంటాయి. అందువల్ల పెసలను రోజూ తినాలి. పెసలు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని రోజూ నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
పెసలను రోజూ ఒక కప్పు మోతాదులో నానబెట్టి తింటుండాలి. దీని వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా మహిళలకు పెసలు బాగా మేలు చేస్తాయి. వారికి నెలసరి సమయంలో లేదా డెలివరీ అయినప్పుడు రక్తం బాగా పోతుంది. కానీ పెసలను ఆహారంగా తీసుకుంటే కోల్పోయిన రక్తాన్ని మళ్లీ పొందవచ్చు. ఇక పెసలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే శరరీంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.
పెసలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. షుగర్ అధికంగా ఉన్నవారు రోజూ పెసలను తింటుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పెసలను తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదలకు సహాయ పడుతుంది. దీని వల్ల పుట్టబోయే పిల్లల్లో నాడీ సంబంధ లోపాలు రాకుండా చూసుకోవచ్చు. పెసలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కనుక వీటిని మనం రోజూ తింటే మనకు దాదాపుగా అన్ని పోషకాలు లభిస్తాయి.
పెసలలో వృక్ష సంబంధమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నాన్‌వెజ్ తినలేని వారికి ఇవి అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. వీటిని తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో కండరాల మరమ్మత్తు జరుగుతుంది. కండరాలు నిర్మాణమవుతాయి. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. పెసలలో అనేక రకాల బి విటమిన్లతోపాటు ఐరన్, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ ఉదయం తింటే మంచిది. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎంత పనిచేసినా అలసిపోకుండా ఉంటారు. పెసలలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్ ,మలబద్దకం ఉండవు. పెసలలో ఫైటిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా పెసలను రోజూ నానబెట్టి తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.