HIV | హెచ్ఐవీ వైద్య పరీక్షల విషయంలో చాలా మందికి ఉండే అపోహలు ఇవే.. ముందస్తు పరీక్షలు ఎంతో మేలు..
హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) గురించి ఇప్పటికీ సమాజంలో అనేక అపోహలు కొనసాగుతున్నాయి. ఈ అపోహల కారణంగా చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో వ్యాధిని ఆలస్యంగా గుర్తించి చికిత్స ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతోంది.
HIV | హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) గురించి ఇప్పటికీ సమాజంలో అనేక అపోహలు కొనసాగుతున్నాయి. ఈ అపోహల కారణంగా చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో వ్యాధిని ఆలస్యంగా గుర్తించి చికిత్స ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఆధునిక వైద్యంతో హెచ్ఐవీని సమర్థంగా నియంత్రించవచ్చని, అందుకు ముందస్తు నిర్ధారణ ఎంతో కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హెచ్ఐవీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్. ఇది చికిత్స లేకుండా చాలా కాలం కొనసాగితే ఎయిడ్స్ (AIDS) దశకు చేరే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం దీనికి పూర్తిస్థాయి నివారణ లేకపోయినా, సరైన మందులతో వైరస్‌ను నియంత్రిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సాధ్యమే. అయితే అందుకు ముందుగా పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవడం అవసరం.
ఎవరైనా సరే పరీక్షలు అవసరమే..
చాలామంది హెచ్ఐవీ పరీక్షలు కేవలం అధిక ప్రమాదంలో ఉన్నవారికే అవసరమని భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. వయస్సు, లింగం, వివాహ స్థితి, విద్య, వృత్తితో సంబంధం లేకుండా ఎవరికైనా హెచ్ఐవీ సోకే అవకాశం ఉంటుంది. వివాహితులు, సంబంధాల్లో ఉన్నవారు లేదా తమకు ఈ ప్రమాదం లేదని భావించే వారు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉన్నందున అవసరమైన సందర్భాల్లో పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో, వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షల్లో లేదా వైరస్‌కు గురైన అనుమానం ఉన్నప్పుడు పరీక్షలు చేయించుకోవడం బాధ్యతాయుతమైన ఆరోగ్య సంరక్షణలో భాగమని పేర్కొంటున్నారు. హెచ్ఐవీ సోకిన వెంటనే లక్షణాలు కనిపిస్తాయని చాలామంది అనుకుంటారు. అయితే వైరస్ శరీరంలో ఉన్నప్పటికీ చాలామంది చాలా సంవత్సరాల పాటు పూర్తిగా ఆరోగ్యంగా కనిపిస్తారు. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్ల చాలామంది పరీక్షలను వాయిదా వేస్తుంటారు. అయితే వ్యాధి పురోగమించిన తర్వాత తరచూ ఇన్ఫెక్షన్లు రావడం, అనుకోకుండా బరువు తగ్గడం, ఎక్కువ రోజులు జ్వరం ఉండటం, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అప్పటికే రోగనిరోధక శక్తి బలహీనపడే ప్రమాదం ఉంటుంది. అందుకే లక్షణాల కోసం ఎదురుచూడకుండా అవసరమైతే ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
కచ్చితత్వంతోనే ఉంటాయి..
హెచ్ఐవీ పరీక్షలు కచ్చితంగా ఉండవని మరో అపోహ కూడా సమాజంలో ఉంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరీక్షా విధానాలు అత్యంత కచ్చితమైన ఫలితాలను అందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగో తరం (Fourth Generation) పరీక్షలు వైరస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అవసరమైనప్పుడు నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి పరీక్షల కచ్చితత్వంపై అనుమానాలతో వాటిని వాయిదా వేయాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
సమాచార్యంపై గోప్యత..
హెచ్ఐవీ పరీక్ష చేయించుకుంటే సమాజంలో అపోహలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం కూడా చాలామందిని వెనక్కి నెడుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులు ఎలా స్పందిస్తారో అన్న ఆందోళనతో కొందరు పరీక్షలకు వెళ్లరు. అయితే హెచ్ఐవీ పరీక్షలలో రోగుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని, వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచే విధానాలు అమల్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సమాజ భయంతో పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కలిగే నష్టం, పరీక్ష చేయించుకోవడం వల్ల కలిగే అసౌకర్యం కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.హెచ్ఐవీపై అవగాహన పెరగడం, అపోహలను దూరం చేయడం, అవసరమైనప్పుడు పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. సకాలంలో చికిత్స తీసుకుంటే ఆరోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

