Health Tips : సంప్రదాయ ఔషదంగా, వంట దినుసుల్లోనూ విరివిగా వాడే దాల్చిన చెక్క సుగంధ ద్రవ్యాల్లో ముందువరసలో ఉంటుంది. ప్రత్యేకమైన ఫ్లేవర్‌తో వంటకాలకు ఇది రుచిని పెంచుతుంది. దశాబ్దాలుగా ఔషధాల్లో, వంటల్లో దాల్చిన చెక్కను వాడుతున్నారు. ఇక ఇన్సులిన్ సెన్సిటివిటీలను మెరుగుపరచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రించడం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కల్పించే క్రమంలో దాల్చిన చెక్క మధుమేహులకు ఉపకరిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.దాల్చిన చెక్కలో ఉండే సినామైడిహైడ్, పాలిపెనాల్స్ వంటి పదార్ధాలు ఇన్సులిన్ పనితీరును పెంచి, కార్బోహైడ్రేట్ బ్రేక్‌డౌన్‌ను మందగించేలా చేస్తాయి.
కణాలు దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి. మన ఆహారంలో దాల్చిన చెక్కను భాగం చేసుకుంటే మధుమేహం అదుపులో ఉండటంతో పాటు మధుమేహంతో వాటిల్లే కాంప్లికేషన్స్‌ను నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కను నిత్యం తీసుకోవడం ద్వారా మధుమేహులకు కలిగే ప్రయోజనాలు పరిశీలిద్దాం..
బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుదల
ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు చెక్
యాంటీ ఇన్ఫ్లమేటరీ
కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగుదల
మెరుగైన జీర్ణక్రియ
బరువు నియంత్రణ
మెదడు ఆరోగ్యం మెరుగుదల
Read More :
Heavy rains | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు