Diwali care | దీపావళి పండుగ వచ్చిదంటే.. చిన్నా పెద్దా అందరికీ ఆనందమే. టపాసులు కాల్చటానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అమవాస్య కారు చీకట్లను దీపాల వెలుగులతో పారదోలుతుంటారు. ఈ పండుగ కోసం చాలా మంది ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ ఆనందంలో పడి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అప్రమత్తతకు మించినది మరోటి ఉండదు. దీపావళి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవడానికి మనం తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరిచిపోవద్దు.