Health Tips | చలికాలంలో ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి ఏం చేయాలంటే..!
శీతాకాలంలో చల్లటి వాతావరణంతో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు ఎముకలు, కీళ్లు సహా శరీరం అంతటిపై (Health Tips) వింటర్ ఎఫెక్ట్ ఉంటుంది.
న్యూఢిల్లీ : శీతాకాలంలో చల్లటి వాతావరణంతో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు ఎముకలు, కీళ్లు సహా శరీరం అంతటిపై (Health Tips) వింటర్ ఎఫెక్ట్ ఉంటుంది. చలి వాతావరణంతో ఎముకలు, కీళ్లు గట్టిగా మారి నొప్పులకు దారితీయడం, కొన్నిసార్లు అదుపు తప్పి కిందపడే ముప్పూ పొంచిఉంటుంది. అయితే వైద్య నిపుణుల సూచనతో కీళ్లు, ఎముకలను ఆరోగ్యంగా మలుచుకోవడంతో పాటు శీతాకాలంలో అనారోగ్యాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ప్రముఖ ఆర్ధోపెడిక్ నిపుణులు డాక్టర్ అశ్వని మైచంద్ చెబుతున్నారు.
చలికాలంలో ముఖ్యంగా ఎముకల బలోపేతానికి రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం తప్పనిసరి. నడక, రన్నింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, మెట్లు ఎక్కడం వంటి యాక్టివిటీస్ చేపట్టాలి. బరువులు మోసే వర్కవుట్స్‌తో సమస్యలు ఎదుర్కొనేవారు స్విమ్మింగ్ చేసినా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. యోగ, పైలేట్స్, డ్యాన్స్ వంటి యాక్టివిటీస్ కూడా చేయవచ్చు. వర్కవుట్స్‌ను నెమ్మదిగా ప్రారంభించి మెల్లిగా వ్యాయామాలు చేసే వ్యవధిని, తీవ్రతను పెంచుకుంటూ పోవాలి. ఎముకల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ డీ, క్యాల్షియమ్ తగినంత ఉండేలా చూసుకోవాలి.
క్యాల్షియం అధికంగా ఉండే డైరీ ఉత్పత్తులు, కాయగూరలు, ఆకుకూరలు, క్యాల్షియం పోర్టిఫైడ్ ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ కే, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పండ్లు, కూరగాయలు, నట్స్‌ను తరచూ తీసుకోవాలి. అధిక బరువు కీళ్లు, ఎముకలపై ఒత్తిడి పెంచే క్రమంలో బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. శారీరకంగా చురుకుగా ఉండటంతో పాటు ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ బీ12, విటమిన్ డీ లోపం తలెత్తితే వైద్యుడిని సంప్రదించి అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా చూసుకోవడంతో పాటు చలికాలంలో వేడిగా ఉండే తాజా ఆహారాన్ని తీసుకోవడం మేలు.
Read More :
Hairfall | చలికాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా?…
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- bones
- health tips
- Joints
- winter
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

