Hairfall | చలికాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? మీ ఫుడ్‌లో ఈ మార్పులు చేసి చూడండి!
Hairfall | చలికాలంలో నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వెంట్రుకల్ని కాపాడుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
Hairfall | చలికాలంలో నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వెంట్రుకల్ని కాపాడుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
– ఓ పాఠకురాలు
మన ఒంటి మీద ఉన్నట్టే తలమీదా చర్మమే ఉంటుంది. సాధారణంగా చలికాలం చర్మం పగులుతుంది. తల చర్మం కూడా పొడిబారుతుంది. క్రమంగా పగిలి పెచ్చులుగా మారుతుంది. శీతకాలం చుండ్రు రావడమంటే ఇదే. ఆ పెచ్చులు చర్మం మీది తైల గ్రంథుల్ని మూసేస్తాయి. దీంతో, జుట్టు రాలుతుంది. తలకు తరచూ నూనె పెట్టడం వల్ల ఈ సమస్యను కొంతమేర నివారించవచ్చు. ఇక, శరీరం లోపలి నుంచి కూడా నూనెలను అందించేందుకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం.
వాల్నట్స్, అవిసె, గుమ్మడి గింజల్లాంటి వాటితోపాటు సాల్మన్ ఫిష్‌లో ఇందుకు పనికొచ్చే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. పొరలుగా వస్తున్నదీ అంటే మృత చర్మం కిందే లెక్క. ఆ స్థానంలో కొత్త చర్మం ఏర్పడాలి. ఇందుకు ప్రొటీన్లు అవసరం. ఆ ప్రయత్నంలో కోడి మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తుల్లాంటి వాటితో పాటు దాల్ సూప్, పనీర్ సలాడ్ లాంటివి తీసుకోవచ్చు. విటమిన్-ఎ, ఫోలిక్ యాసిడ్, బి6, బయోటిన్ జుట్టు ఆరోగ్యానికి కీలకం. చర్మం మీది సెబాషియస్ గ్రంథి సీబమ్ అనే నూనెలాంటి పదార్థాన్ని తయారు చేస్తుంది.
తద్వారా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీని ఉత్పత్తిని పెంచేందుకు విటమిన్-ఎ ఎంతో సాయపడుతుంది. క్యారెట్, గుమ్మడి, పాలకూర, ఇతర ఆకుకూరలు, రంగుల కూరగాయల్లో ఇది ఉంటుంది. చర్మంలోని కొత్త కణాల పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ దోహదపడుతుంది. రకరకాల నట్స్, సోయా, ఆకుకూరల్లో ఈ ఫోలిక్ యాసిడ్ దొరుకుతుంది.
చుండ్రును అరికట్టేందుకు విటమిన్- బి6 ఉపకరిస్తుంది. బియ్యం, గోధుమ, జొన్నలాంటి ధాన్యాలతో పాటు గుడ్డు పచ్చసొన, మటన్ లివర్‌లోనూ బి6 లభిస్తుంది. ఇక జుట్టు రాలడాన్ని అరికట్టడానికి బయోటిన్ సాయపడుతుంది. ఈ పదార్థం గుడ్డు, లివర్, సోయాలో ఉంటుంది. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించి బయోటిన్ సప్లిమెంట్లను వాడవచ్చు. కేశాలను సంరక్షించుకోవచ్చు.
మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

