Health tips : తాటికల్లు (Toddy) అంటే కొంతమంది ఇది కూడా రకమైన మద్యమే అనుకుంటారు. మద్యం (Liquor) లాగే తాటికల్లు కూడా ఆరోగ్యానికి కీడు చేస్తుందని భావిస్తారు. కానీ, తాటికల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందే తప్ప కీడు జరగదని ఆరోగ్య నిపుణులు (Health experts) చెబుతున్నారు. అయితే తాటికల్లు కూడా మత్తుపానీయమే కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కల్లులో కల్తీ జరిగితే మాత్రమే ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఏ మందులు కలువని స్వచ్ఛమైన తాటికల్లు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు.
తాటికల్లులో పోటాషియం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె సంబంధిత అనారోగ్యాలు దరిచేరకుండా నివారిస్తోంది.
తాటికల్లులో సహజ ఎంజైమ్లు, ప్రొబయోటిక్స్ ఉంటాయి. అవి జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపర్చి తీసుకున్న ఆహారం వేగంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతాయి.
అదేవిధంగా తాటికల్లులో గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు కూడా ఉండడంవల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అయితే మధుమేహం ఉన్నవాళ్లు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే తాటికల్లును సేవించడం ఉత్తమం.
ఇంకా తాటికల్లులో విటమిన్ బీ, విటమిన్ సీ కూడా ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో అంత సులువుగా అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.
తాటికల్లులో విటమిన్లతోపాటు మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలర్జీలు, దురదలు లాంటివాటిని నివారిస్తాయి.
వేసవి కాలంలో తాటికల్లు తాగడంవల్ల శరీరంలోని వేడి తగ్గి చలువ చేస్తుంది. అంతేగాక రక్తహీనత లాంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా తాటికల్లు తోడ్పడుతుంది.