Saf flower oil Benefits | విత్తనాల కోసం పండించే కుసుమ పంటను ప్రస్తుతం ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. పూర్వం రోజుల్లో వంటలకు రంగు తీసుకురావడం కోసం ఈ విత్తనాలను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి నుంచి నూనె తీసి వంటలకు వాడుతున్నారు. కుసుమ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను చూపుతున్నదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.
కుసుమ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుసుమ నూనెలో మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్, జింక్, ఇనుము, రాగి, ప్రొటీన్ ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల కుసుమ నూనెలో కొవ్వులు 38 గ్రాములు, సోడియం 3 గ్రాములు, పొటాషియం 687మిల్లి గ్రాములు, కార్బొహైడ్రేట్స్ 34 గ్రాములు, ప్రొటీన్ 16 గ్రాములు, విటమిన్ బీ12 88 శాతం ఉంటుంది, కుసుమ గింజల నుంచి తీసే మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్.. రెండు రకాల నూనెలను వంటల తయారీకి, కూరల వేపుళ్లకు వాడొచ్చు.
ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు..
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కీళ్ల నొప్పులు తగ్గించడం, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడం, చర్మం, జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
శరీరం బరువు తగ్గించుకోవాలనుకునే వారు ఈ నూనెతో చేసిన వంటలను తినడం అలవాటు చేసుకోవాలి. దీనిలో విటమిన్ ఈ అధిక మొత్తంలో ఉంటుంది.
మన శరీరానికి అవసరమైన ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను సరైన రీతిలో ఉంచేందుకు సాయపడుతుంది. అథెరోస్క్లెరోసిస్, గుండెపోటు, స్ట్రోక్ వంటి ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఈ నూనెలో యాంటిఆక్సిడెంట్స్ ఉండిగుండెకు మేలు చేకూరుస్తాయి. ఈ నూనె వాడటం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది.
ఈ నూనె శరీరంలో కొవ్వులా పేరుకోదు. పైగా శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా లావు తగ్గాలనుకునే వాళ్లు వంటకాల్లో ఈ నూనెను వాడటం మేలు. రోగనిరోధక శక్తినిన బలపరచడంలో సాయపడుతుంది.
ఇది మనలో సెరోటోనిన్ హార్మోన్‌ను పెంచి డిప్రెషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. రుతు సమస్యలను నివారిస్తుంది. హార్మోన్లపై సానుకూల ప్రభావం చూపిస్తంది.
ఈ నూనె మనలో జీవక్రియలను మెరుగుపర్చడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ రాకుండా మనల్ని కాపాడుతుంది. దీనిలో ఉండే లినోలిక్ ఆసిడ్ జుట్టుకు చాలా మంచిది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.