Beer | వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మద్యం ప్రియులు బీర్లను అధికంగా సేవిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎర్రని ఎండలో చల్లని బీర్ తాగితే వచ్చే మజాయే వేరని చెప్పి మద్యం ప్రియులు బీర్లను తాగుతుంటారు. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మోతాదులో బీర్ తాగితే లాభాలే పొందవచ్చని, కానీ అతిగా మాత్రం దీన్ని సేవిస్తే లాభాలు కలగకపోగా, నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయిన ఆల్కహాలిక్ బేవరేజ్గా ప్రసిద్ధి చెందింది. బీర్ తాగడం వల్ల పలు లాభాలు ఉంటాయని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. బీర్‌ను సేవిస్తే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయి.
బీర్ వల్ల అందానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. బీర్‌ను కొందరు చర్మానికి నేరుగా అప్లై చేస్తారు. దీంతో ముఖంలో కాంతి పెరుగుతుంది. కొందరు జుట్టుకు కూడా అప్లై చేస్తారు. ఇది శిరోజాలను కాంతివంతంగా మారుస్తుంది. బీర్‌ను అధికంగా సేవిస్తే శరీరానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా బరువు పెరుగుతారు. లివర్ చెడిపోతుంది. కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వారానికి రెండు సార్లు ఒక గ్లాస్ చొప్పున బీర్ తాగవచ్చని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. ఇంతకు మించితే దుష్పరిణామాలు ఎదురవుతాయని చెబుతున్నారు. కొందరు మాంసాన్ని మారినేట్ చేసేందుకు బీర్‌ను కూడా ఉపయోగిస్తారు. దీంతో ముక్కలు టేస్టీగా ఉండడమే కాదు, మెత్తగా కూడా ఉడుకుతాయి.
కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒక బీర్ తాగితే పోతుందట. బీర్ సహజంగానే కార్బొనేటెడ్ డ్రింక్. కనుక పొట్టలో ఏర్పడే అసౌకర్యాన్ని ఇది తగ్గిస్తుంది. గ్యాస్, అల్సర్ ఉన్నవారు మాత్రం ఈ చిట్కా ప్రయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని బీర్లో ముంచి ఆ వస్త్రంతో బంగారు నగలను తుడిస్తే అవి తళతళా మెరిసిపోతాయి. చర్మాన్ని మృదువుగా ఉంచడంలోనూ బీర్ పనిచేస్తుంది. బీర్‌ను స్నానం చేసే నీటిలో కాస్త పోసి స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సొంతం చేసుకుంటుంది. రొయ్యల్ని వండేటప్పుడు కాస్త బీర్ చల్లితే కూర రుచిగా ఉంటుంది. అయితే బీర్ చల్లిన తరువాత ఏ కూరను అయినా సరే అతిగా ఉడికించకూడదు. లేదంటే చిదురు అయ్యే అవకాశాలు ఉంటాయి.
బీర్ వల్ల శిరోజాలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని జుట్టుకు అప్లై చేస్తే మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. బీర్ తాగితే చర్మం తేమగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. చర్మ కాంతి పెరుగుతుంది. అధిక వేడి వల్ల చర్మం రక్షించబడుతుంది. కొన్ని దేశాలకు చెందిన వారు తరచూ బీర్ బాత్ చేస్తుంటారు. బీర్‌తో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు. బీర్‌ను సేవిస్తే చర్మం పీహెచ్ విలువ సరైన స్థితిలో ఉంటుంది. దీంతో చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. బీర్ వల్ల వయస్సు మీడ పడడం కనబడదు. వృద్ధాప్య చాయలను బీర్ కనిపించనివ్వదు. బీర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ముడతలను తగ్గిస్తాయి. చర్మం వాపులకు గురి కాకుండా కాపాడుతాయి. ఇలా బీర్‌తో పలు ప్రయోజనాలను పొందవచ్చు. కానీ మోతాదులో సేవిస్తేనే ఈ లాభాలు ఉంటాయి.