అనారోగ్యం, చదువు, టూర్.. ఇలా దేనికోసమైనా ఇంటర్నెట్పై ఆధారపడటం సాధారణం అయిపోయింది. ఇలా ప్రతి విషయాన్నీ ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం అనేది ఒక వ్యాధి అని చెబుతున్నారు నిపుణులు. దానినే ఇడియట్ సిండ్రోమ్ అని పిలుస్తారట (ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్టివ్ ట్రీట్మెంట్). ఇది వ్యక్తి మానసిక స్థితికి సంబంధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి డాక్టర్ కంటే ఇంటర్నెట్‌ని ఎక్కువగా నమ్ముతున్నాడు. ఇంటర్నెట్లో పలువురు ఇచ్చే సలహాలు, సూచనల సాయంతో తనకు వచ్చిన వ్యాధికి చికిత్స చేసుకుంటున్నాడు.
లక్షణాలు: ఇడియట్ సిండ్రోమ్‌తో బాధపడే వ్యక్తి డాక్టర్ల మాటలు,చికిత్సపై విశ్వాసం కోల్పోతాడు. ఇంటర్నెట్ అన్నిటికీ సాయపడుతుందని గుడ్డిగా నమ్ముతాడు. దానిని మానసిక సమస్యగా గుర్తించలేక అనేక అనుమానాలు, ఆలోచనలతో ఇబ్బంది పడతాడు. కాలక్రమంలో కుంగిపోతుంటాడు.
కారణాలు: ఇడియట్ సిండ్రోమ్‌కు అనేక కారణాలు ఉన్నాయి. మెదడులో రసాయన మార్పులు, జన్యుపరమైన కారణాల వల్లఈ సిండ్రోమ్ వస్తుంది. మానసిక స్థితి కూడా దీనికి ఒక కారణం.ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారు వారిపై వారు ప్రతికూల ఆలోచనలు పెంచుకుంటారు. సమస్యల నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తారు.
బయటపడటం ఎలా: ఇడియట్ సిండ్రోమ్‌ను సీరియస్‌గా తీసుకుని చికిత్స తీసుకోవాలి. దానికోసం మొబైల్ వాడకం తగ్గించాలి. ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దాని గురించి ఇంటర్నెట్లో వెతక్కుండా డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలి. చికిత్స, అనారోగ్య సమస్యల గురించి నిపుణులతో చర్చించకుండా నిర్ధారణకు రాకూడదు.