Sugarcane Juice | ఎండాకాలంలో చెరుకు రసం తాగే ముందు ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి
Sugarcane Juice | వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనానికి ద్రవ పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు లభ్యమయ్యే వాటిల్లో చెరుకు రసం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కావాల్సిన పోషకాలను అందిస్తుంది.
Sugarcane Juice | న్యాల్కల్, ఫిబ్రవరి 27: వేసవి ఎండల తీవ్రతకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు శీతల పానీయాల వైపు చూస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకెళ్లే వారికి ఈ ఎండలతో తిప్పలు తప్పడం లేదు. దీంతో వీరంతా ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి చెరుకు రసం తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనానికి ద్రవ పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు లభ్యమయ్యే వాటిల్లో చెరుకు రసం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కావాల్సిన పోషకాలను అందిస్తుంది.ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్తుంటే చెరుకు రసం బండ్లు దర్శనమిస్తుంటాయి. తక్కువ ధరకే దొరికే చెరుకు రసాన్ని తాగేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. వేసవిలో ఎక్కడ చూసినా జ్యూస్ సెంటర్లు, చెరుకు రసాల బండ్లు కనిపిస్తుంటాయి. చెరుకు రసం తాగడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిఫుణులు చెబుతున్నారు.
మండే ఎండల నుంచి ఉపశమనానికి, దాహార్తిని తీర్చడామే కాకుండా ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతగానో ఉపయోడపడుతుంది. చెరుకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం చాలావేగంగా తీసుకుని వెంటనే ఉపయోగించుకుంటుంది. చెరుకు రసం తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. చెరుకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరుకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్చిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరుకు రసం దోహదపడుతుంది. చెరుకు రసంలో రోగ నిరోధకశక్తిని పెంచే విటమిన్ సీ, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. అల్కలైన్ స్వభావం కలిగిన చెరుకు రసం ప్రొస్టేట్, కొలన్, ఉపరితిత్తులు, రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. అన్నింటికీ మించి వేసవిలో చెరుకు రసం తాగడంతో శరీరంలో వేడిని తగ్గించి చల్ల బరుస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఐస్‌తో కాస్త జాగ్రత్త…
అల్లం, నిమ్మరసం కలిపి తీసుకుంటే రుచి బాగుండడంతో పాటు పోషకాలు మరో రూపంలోకి మారకుండా నిరోధిస్తాయి. దీంతో సహజసిద్ధ పోషకాలు శరీరంలోకి చేరిపోతాయి. ఇక అల్లం వగరు రుచిని ఇవ్వడంతో పాటు నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఐస్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఐస్ తయారీలో ఎక్కువగా నీటిని శుద్ధి చేయకుండానే వాడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. తద్వారా రోగాల బారినపడే అవకాశం లేకపోలేదు. అందుకే ఐస్ లేకుండా చెరుకు రసం తాగడమే ఉత్తమం. చల్లదనం కోసం ఐస్‌గడ్డలు లేకుండానే చెరుకు రసాన్ని తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం చెరుకు తోటల సాగుకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో చెరుకు రసంతో పాటు నాణ్యమైన బెల్లం లభిస్తాయి. ప్రస్తుతం వేసవి కావడంతో చెరుకు రసం బండ్లు భారీగా వెలిశాయి. నిర్వాహకులు రోడ్ల వెంట గానుగ ఆడించి స్వచ్ఛమైన చెరుకు రసం అమ్ముతున్నారు. ఇటీవల న్యాల్కల్ మండలంలో పర్యటించిన ఫిజీ దేశ చెరుకు అభివృద్ధి శాఖ మంత్రి చరణ్‌జీత్ సింగ్ స్వయంగా చెరుకు రసం బండి వద్దకు వెళ్లి తాగారు.
ఆరోగ్యానికి మంచిది…
చెరుకు రసం తాగడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చెరుకు రసంలో విటమిన్లు, ఖనిజాలు మెండుగా లభిస్తాయి. ఇందులో ముడి చక్కెర, ప్రొటీన్స్, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.శరీరాన్ని త్వరగా చల్లబరిచే గుణం కలిగి ఉంటుంది. ఎండకాలంలో చెరుకు రసంతాగితే వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి తిరిగి శక్తిని అందిస్తుంది.
– శ్వేతప్రియ, న్యాల్కల్ పీహెచ్సీ వైద్యాధికారి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

