Cancer | గుడ్‌న్యూస్.. క్యాన్సర్‌ను ఖతం చేసే థెరపీని కనిపెట్టిన సైంటిస్టులు!
Cancer | క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరికొత్త దివ్యాస్త్రం అందుబాటులోకి వచ్చింది. దేశీయంగా రూపొందించిన ‘కార్-టీ సెల్' థెరపీతో క్యాన్సర్ భూతాన్ని ఖతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యునోయాక్ట్, ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ దవాఖాన పరిశోధకులు సంయుక్తంగా ఈ థెరపీని అభివృద్ధి చేశారు.
Cancer | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరికొత్త దివ్యాస్త్రం అందుబాటులోకి వచ్చింది. దేశీయంగా రూపొందించిన ‘కార్-టీ సెల్’ థెరపీతో క్యాన్సర్ భూతాన్ని ఖతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యునోయాక్ట్, ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ దవాఖాన పరిశోధకులు సంయుక్తంగా ఈ థెరపీని అభివృద్ధి చేశారు. దీనిని రోగులపై ప్రయోగించేందుకు కొద్ది నెలల క్రితం భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదముద్ర వేసింది. 15 మందికి ‘కార్-టీ సెల్ థెరపీ’ అందించగా, ముగ్గురు పేషెంట్లు క్యాన్సర్ నుంచి బయటపడ్డారని తెలిసింది. సరికొత్త థెరపీతో క్యాన్సర్‌ను జయించిన మొదటి పేషెంట్‌గా ఢిల్లీకి చెందిన గుప్తా నిలిచారు. ‘2022లో బోన్‌మ్యారో మార్పిడి విఫలమైంది. కొద్ది రోజులే బతుకుతాననుకున్నా. తర్వాత ముంబై, టాటా మెమోరియల్ దవాఖానలో కార్-టీ సెల్ థెరపీ తీసుకున్నా. రూ.42 లక్షలు ఖర్చయింది. విదేశాల్లో రూ.3-4 కోట్ల వరకు అవుతుంది’ అని చెప్పారు.
ఏమిటీ ‘కార్-టీ సెల్’ థెరపీ?
క్యాన్సర్ బారిన పడ్డాక, రోగి శరీరంలోని తెల్లరక్త కణాలు వాటిని గుర్తించవు. దీంతో క్యాన్సర్ కణాలు పెరిగి.. రోగం ముదురుతుంది. దీన్ని అడ్డుకునేందుకు వైద్యులు అభివృద్ధి చేసిన థెరపీనే ‘కార్-టీ సెల్’. తొలుత పేషెంట్ తెల్లరక్త కణాల్ని వైద్యులు సేకరిస్తారు. వాటిని జన్యుమార్పిడి చేసి పేషెంట్‌కు ఇంజెక్షన్ ద్వారా అందిస్తారు. రోగి శరీరంలో చేరిన ‘కార్-టీ సెల్స్’ క్యాన్సర్ కణాల్ని గుర్తించి అంతమొందిస్తాయి. కీమోథెరపీ ఫెయిలయిన కేసుల్లోనూ ‘కార్-టి సెల్’ అద్భుతంగా పనిచేస్తుందని ‘ఇమ్యునోయాక్ట్’ సీఈవో డాక్టర్ రాహుల్ చెబుతున్నారు.
మరిన్ని పరీక్షలు జరపాలి..
కార్-టీ సెల్ థెరపీకి సీడీఎస్‌సీవో అనుమతి పొందాల్సి ఉంది. చండీగఢ్‌లోని ప్రఖ్యాత పీజీఐఎంఈఆర్ దవాఖాన సహా పలు హాస్పిటల్స్ ఈ థెరపీపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నాయి. ‘ఈ విధానంలో ప్రస్తుతానికి బి-సెల్ క్యాన్సర్‌పై మాత్రమే విజయం సాధించాం. శరీరం నుంచి ఆ క్యాన్సర్ కణాల్ని పూర్తిగా వెళ్లగొట్టగలిగాం. ఇక జీవితంలో మళ్లీ క్యాన్సర్ రాదని భావించలేం. మరిన్ని క్లినికల్ ట్రయల్స్ జరపాలి’ అని డాక్టర్ హస్ముఖ్ జైన్ అన్నారు. డాక్టర్ గుప్తాకు కార్-టీ సెల్ థెరపీ చికిత్సను అందించిన డాక్టర్ ఈయనే.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

