Immunity Boosting Drinks : సీజన్ మార్పుతో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటివి పలువురిని వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో విశ్రాంతి, తగినంతగా నీరు తీసుకోవడం ముఖ్యం. ఇక వీటితో పాటు కొన్ని పానీయాలతో గొంతు నొప్పి లక్షణాలు, జలుబు తగ్గుముఖం పట్టడంతో పాటు రోగ నిరోధక వ్యవస్ధను సైతం బలోపేతం చేస్తాయి.
వీటిలో ముందుగా హెర్బల్ టీలను ప్రస్తావించాలి. అల్లం, పుదీనా వంటి పదార్ధాలతో చేసిన టీలను తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలగడంతో పాటు ఇమ్యూనిటీ కూడా బలోపేతమవుతుంది.
ఇక తేనె, నిమ్మరసం కలిపి గోరువెచ్చని నీటిని తీసుకుంటే వీటిలో ఉండే ఇమ్యూనిటీ బలోపేతం చేసే పదార్ధాలు ఆయా అనారోగ్య లక్షణాలను తొలగించడంతో పాటు రోగనిరోధక వ్యవస్ధనూ బలోపేతం చేస్తాయి. ఇంకా పసుపు పాలు, అలోవెరా జ్యూస్ కూడా ఇన్ఫెక్షన్స్ నివారించి ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. గొంతు నొప్పిని తగ్గించే మెరుగైన పానీయాలను పరిశీలిస్తే..
హెర్బల్ టీలు
గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం
పసుపు పాలు
అలొవేరా జ్యూస్
యాపిల్ సైడర్ వెనిగర్ టానిక్
దాల్చిన చెక్క
హాట్ సూప్స్
ఫ్రూట్ జ్యూస్లు
Read More :
Arvind Kejriwal | ఈడీ విచారణకు హాజరవుతా : కేజ్రీవాల్